Nara Lokesh: రాజకీయాలు ఎలా ఉండాలి.. రాజకీయ నాయకుడు ఎలాంటి నేపథ్యం నుంచి పుట్టుకు రావాలి.. ఎలాంటి వాడితే ప్రజలకు సేవ చేయగలుగుతాడు.. రాజకీయాలు ఎలా ఉంటే సామాన్యులు కూడా ఆకర్షితులై రాగలుగుతారు.. వీటికి మిగతా పార్టీలు ఏమోగానీ.. టిడిపి మాత్రం సరికొత్త నిర్వచనం ఇస్తోంది. బడుగులకు.. బలహీన వర్గాలకు.. వెనుకబడిన వారికి అవకాశాలు కల్పించడం టిడిపికి కొత్త కాదు. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు.. ఎస్సీలకు.. ఎస్టిలకు పదవులు ఇచ్చారు. రాజకీయంగా అవకాశాలు కల్పించారు. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా చేశారు. అందువల్లే టిడిపిని బడుగు బలహీన వర్గాల పార్టీ అని పిలుస్తుంటారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే చంద్రబాబు వరకు ఇదే సిద్ధాంతాన్ని అమలు చేశారు. ఇప్పుడు వారి వారసత్వాన్ని నారా లోకేష్ అమలు చేస్తున్నారు.
పేదలకు అండదండలు అందించడంలో.. బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడంలో నారా లోకేష్ ముందుంటారు. ప్రభుత్వ పాలసీలను.. పేదలకు అనుకూలంగా మార్చుతారు. ఆయన విద్యా శాఖ మంత్రి అయిన తర్వాత ఎంతోమంది పేదలకు అండగా నిలిచారు. వారు ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సాహం కల్పించారు. పేదలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో లోకేష్ అనుసరించిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి రాజకీయంగా అవకాశాలు కల్పించింది. ఈ వ్యక్తికి కూడా అలాంటి అవకాశం కలిగింది.. చివరికి ఆ వ్యక్తి నేడు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించబోతున్నారు.
కృష్ణా జిల్లాలోని పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని గడిచిన పాతిక సంవత్సరాలుగా రోజువారిగా శుభ్రం చేస్తూ.. నిత్యం భక్తిశ్రద్ధలతో సేవలు చేస్తోంది చింతేశ్వరరావు కుటుంబం. ఇతడు ఏనాడు ప్రతిఫలాన్ని ఆశించలేదు. తనకు ఉన్న వనరులతోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని పవిత్రంగా చూసుకుంటున్నాడు. ఇతడి కుటుంబం చూపించిన నిబద్ధత పార్టీ నాయకత్వాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చింతేశ్వరరావు భార్య శీలం వెంకటేశ్వరమ్మ కు టిడిపి పామరులో జడ్పిటిసిగా పోటీ చేసే అవకాశం కల్పించింది.
శీలం వెంకటేశ్వరమ్మ మంచితనం.. పార్టీకి ఉన్న పట్టు వల్ల ఇక్కడ ఆమె ఏకపక్షమైన విజయం సాధించారు. 8469 ఓట్ల భారీ మెజారిటీని ఆమెకు దక్కేలా చేశారు. దశాబ్దాలుగా చింతేశ్వర రావు కుటుంబం చేస్తున్న సేవను గుర్తించిన ప్రజలు.. వెంకటేశ్వరమ్మ ను గెలిపించారు. టిడిపిలో సామాన్యుల సైతం అగ్ర తాంబూలం లభిస్తుందని.. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని.. అటువంటి వారికి కచ్చితంగా అవకాశాలు లభిస్తాయని చింతేశ్వరరావు కుటుంబం నిరూపించింది. పామర్రులో చింతేశ్వరరావు సతీమణి విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు.. టిడిపి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిస్వార్ధమైన అభిమానం.. ప్రజాసేవ ఎప్పటికీ వృధా కాదని చింతేశ్వరరావు సాధించిన విజయం చాటి చెబుతోంది.
నారా లోకేష్ నాయకత్వం లో టిడిపి మరింత దూసుకుపోతోంది. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించారు. సీనియర్ ఎన్టీఆర్ చూపించిన బాటలో ఆయన నడిచారు. ఇప్పుడు నారా లోకేష్ మాలాంటి వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. అందువల్లే చిక్కు వెంట్రుకలు అమ్ముకొనే మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. విజయం సాధించి పామర్రు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని దక్కించుకున్నామని” చింతేశ్వరరావు భావోద్వేగంతో చెబుతున్నారు.