Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham Funeral: ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం.. మీడియా ముందు ఫైర్..

Mudragada Padmanabham Funeral: ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం.. మీడియా ముందు ఫైర్..

Mudragada Padmanabham Funeral: ప్రముఖ రాజకీయ నాయకులు , కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తన తుది శ్వాసని విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానులు , బంధు మిత్రులు , రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నేడు ఉదయం సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ […]

Mudragada Padmanabham Funeral: ప్రముఖ రాజకీయ నాయకులు , కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తన తుది శ్వాసని విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానులు , బంధు మిత్రులు , రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నేడు ఉదయం సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఫోన్లో సంభాషించుకొని , ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకు ముద్రగడ పద్మనాభం కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రతికి ఉన్నన్ని రోజులు ప్రభుత్వం ఆయన్ని ఎంతగానో అవమానించింది. ఇప్పుడు ఎందుకు ఈ నాటకాలు , మాకేమి అవసరం లేదని చెప్పి వెనక్కి పంపినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వైసీపీ నేత జక్కంపూడి రాజా మీడియా తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ముద్రగడ పద్మనాభం గారు ఏనాడూ కూడా అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని , చాలా నిస్వార్థంగా ఆయన జనాల కోసం పోరాటం చేసారని , అలాంటి మహోన్నత వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు జక్కంపూడి రాజా. మరోపక్క ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి తన తండ్రి ని చివరి చూపు చూసేందుకు రాగా, ముద్రగడ అనుచరులు ఆమెని అడ్డుకున్నారు. దీంతో ఆమె బోరుమని విలపించింది , గందరగోళ వాతావరణం నెలకొంది, అనంతరం పోలీసులు కలుగచేసుకొని , క్రాంతి ని ముద్రగడ పార్థివ దేహం వద్దకు తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ అంత్యక్రియ కార్యక్రమానికి వైసీపీ పార్టీ నేతలతో పాటు , కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ వంటి వారు కూడా వచ్చారు.

ఇదంతా పక్కన పెడితే ముద్రగడ పద్మనాభం చివరి రోజుల్లో ప్రశాంతంగా బ్రతకలేదనే చెప్పాలి. 2024 వ సంవత్సరం లో ఆయన వైసీపీ పార్టీలో చేరడం, పవన్ కళ్యాణ్ ని పిఠాపురం లో ఓడించకపోతే తన పేరుని మార్పించుకుంటానని సవాలు చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీ తో గెలవడం తో , ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకోవడం వంటివి ఎలాంటి సంచలనాలకు దారి తీసిందో మన కళ్లారా చూశాము . అంతే కాకుండా కూతురు క్రాంతి జనసేన పార్టీ లో చేరడం తో , వీళ్లిద్దరి మధ్య కొద్దిపాటి మాటల యుద్ధం కూడా నడిచింది. అయితే పేరు మార్చుకున్న తర్వాత ముద్రగడ రాజకీయ కార్యక్రమాల్లో దూరంగా ఉంటూ రావడంతో , అసలు ఏమి జరిగిందో ఏంటో అని అంతా అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రాజకీయాలకు దూరం గా ఉన్నారని ఈమధ్యనే తెలిసింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper