Homeఎంటర్టైన్మెంట్Mudragada Padmanabham: ముద్రగడ చివరి కోరికని బయటపెట్టిన కుటుంబ సభ్యులు..అసత్య ప్రచారాలకు చెక్..

Mudragada Padmanabham: ముద్రగడ చివరి కోరికని బయటపెట్టిన కుటుంబ సభ్యులు..అసత్య ప్రచారాలకు చెక్..

Mudragada Padmanabham: రీసెంట్ గానే ప్రముఖ రాజకీయ నాయకులు , కాపు సామజికవర్గం ఉద్యమ నేత, ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన ఘటన యావత్తు ప్రజానికాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముద్రగడ పద్మనాభం అంటే ,పార్టీ తో సంబంధం లేకుండా ముఖ్య నేతలందరూ ఆయన్ని ఎంతగానో అభిమానిస్తుంటారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై అలిగి వైసీపీ పార్టీ లో చేరడంతో , ఈయనపై కాస్త వ్యతిరేకత ఏర్పడింది కానీ , లేకపోతే ఈయన అంటే అందరికీ అభిమానమే. అయితే ముద్రగడ అంత్యక్రియల్లో చోటు చేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ కూతురు క్రాంతి ని చివరి చూపు దక్కకుండా అడ్డుకోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గౌరవ వందన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులపై చెయ్యి చేసుకోవడం , ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దీనిపై ముద్రగడ ఫ్యామిలీ నేడు మీడియా కి ఒక ముఖ్య లేఖని విడుదల చేశారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దు అనడం దగ్గర నుండి, అంత్యక్రియల్లో జరిగిన విధానాల వరకు , ప్రతీ ఒక్క నిర్ణయం ముద్రగడ స్వయంగా మాకు ముందే చెప్పిన అభీష్టం మేరకే చేశామని స్పష్టం చేశారు. అంతే కాదు , కుమార్తె చివరి చూపు పైన కూడా స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకున్నారని, మీ ఊహాగానాలతో కుటుంబాన్ని క్షోభ కి గురి చేయొద్దు అంటూ ముద్రగడ కుమారులు మీడియా కి విజ్ఞప్తి చేశారు. ముద్రగడ బ్రతికి ఉన్న రోజుల్లో , ఆవేశం తో మాట్లాడుతూ ‘నాకు కానీ , మా ఇంట్లో ఎవరికైనా కానీ , ఏదైనా జరిగితే నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా’ అంటూ ఒక వీడియో లో అంటారు ముద్రగడ. బహుశా కుటుంబ సభ్యులు ఆ మాటలని తీసుకొనే కూతుర్ని చివరి చూపు చూడనివ్వకుండా చేసి ఉండొచ్చు. ఆవేశం లో ఎన్నైనా అంటారు , ఎన్ని గొడవలైన కుటుంబ సభ్యుల మధ్య ఉండొచ్చు, కానీ చనిపోయినప్పుడు కూడా ఈ పట్టింపులు ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular