Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy : పార్టీ పెట్టేముందు.. విజయసాయిరెడ్డి పెద్ద ప్లానింగే..

Vijaya Sai Reddy : పార్టీ పెట్టేముందు.. విజయసాయిరెడ్డి పెద్ద ప్లానింగే..

Vijaya Sai Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ప్రజల ఎజెండాగా 15 అంశాలను ప్రకటించానని, ఈ నెల 8న తిరుపతిలో నిర్వహించనున్న తన నాలుగో ప్రెస్‌మీట్‌లో మరో ఐదు ప్రతిపాదనలను ప్రజల ముందుంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కలియుగ దైవమైన తిరుమలేశ్వరుడి సన్నిధిలోని తిరుపతిని ఈ సమావేశానికి వేదికగా ఎంచుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. […]

Vijaya Sai Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ప్రజల ఎజెండాగా 15 అంశాలను ప్రకటించానని, ఈ నెల 8న తిరుపతిలో నిర్వహించనున్న తన నాలుగో ప్రెస్‌మీట్‌లో మరో ఐదు ప్రతిపాదనలను ప్రజల ముందుంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కలియుగ దైవమైన తిరుమలేశ్వరుడి సన్నిధిలోని తిరుపతిని ఈ సమావేశానికి వేదికగా ఎంచుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. రాయలసీమ ఎదుర్కొంటున్న కరువు, ఎల్‌నినో ప్రభావం, ఉపాధి అవకాశాల కొరతతో జరుగుతున్న వలసలు వంటి అంశాలపై సమావేశంలో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.

అదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న రెండు కుటుంబాలపై కూడా తన విమర్శలను కొనసాగించనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. రాయలసీమ అభివృద్ధి, ప్రాంతీయ సమస్యలు, రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబాల ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. గతంలోనూ రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి, యువతకు అవకాశాలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

సంస్కృతి, భారతీయతపై చర్చ

మన సంస్కృతి, భారతీయతపై జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా తిరుపతి సమావేశంలో ప్రస్తావిస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే ఒక వర్గం మైనార్టీగా మారిపోయే పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, దీనికి సంబంధించి మరో ఐదు ప్రతిపాదనలను ప్రజల ముందు ఉంచుతానన్నారు. అయితే ఆ ఐదు ప్రతిపాదనలు ఏమిటన్నది ఆయన ఇంకా వెల్లడించలేదు.

కొత్త పార్టీకి ముందు అజెండా

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. విజయదశమి తర్వాత పార్టీని ప్రారంభించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని గతంలో వెల్లడించారు. పార్టీ విధానాల్లో ప్రజల ఆదాయాన్ని పెంచడం, నిత్యావసరాల ధరలను తగ్గించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్-విద్య-ఉద్యోగాలకు ప్రాధాన్యం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని కూడా ప్రకటించారు.

ఇప్పటివరకు విజయసాయిరెడ్డి విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో తన రాజకీయ కార్యాచరణకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్రకు కూడా ప్రాంతీయ అభివృద్ధి, నీటి సమస్యలు, వలసలు, పరిశ్రమలు వంటి అంశాలపై ఆయన ప్రత్యేక ప్రతిపాదనలు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తిరుపతిలో జరగనున్న నాలుగో ప్రెస్‌మీట్‌లో విజయసాయిరెడ్డి ప్రకటించబోయే ఐదు కొత్త ప్రతిపాదనలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమాజం కోసం ఆలోచించే మీడియా ప్రతినిధులు సమావేశానికి హాజరై తన ప్రతిపాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper