Harmanpreet Kaur: టీమిడియాకు వన్డే వరల్డ్ కప్ అందించింది. ఆసియా కప్ కూడా అందించింది. టీమిండియా క్రికెట్ కు తిరుగులేని దూకుడు నేర్పించింది. అంతకుమించి అగ్రెసివ్ ఆటను అలవాటు చేసింది. ఇదంతా చేసింది మరెవరో కాదు హర్మన్ ప్రీత్ కౌర్. ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసింది. కొంతకాలం పాటు సాధారణ ప్లేయర్ గానే కొనసాగుతానని ప్రకటించింది.
కౌర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది.. అసలు దీని వెనక ఎవరున్నారు.. ఆమెను ఎవరైనా ఇబ్బంది పెట్టారా.. పొమ్మన లేక పొగ పెట్టారా.. మైదానంలో ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. దీని వెనక అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. కాకపోతే హర్మన్ ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం వెనుక కీలకమైన కారణాలు ఉన్నాయి.
కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అకస్మాత్తు నిర్ణయం మాదిరిగా కనిపించినప్పటికీ.. దాని వెనుక ఒక దశాబ్ద నాయకత్వం.. వ్యక్తిగత ఆట మీద పడిన భారం.. జట్టుకు కొత్త నాయకత్వం అవసరమైన ఆలోచనలు ఉన్నాయి.. ఈ నిర్ణయం కంటే ముందు గుహవాటిలో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో హర్మన్.. వైస్ కెప్టెన్ స్మృతి.. హెడ్ కోచ్ అమోల్ పాల్గొన్నారు. అయితే బిసిసిఐ ఆమె తప్పించిందా.. లేకుంటే ఆమె స్వయంగా తప్పుకున్నారా.. ఈ విషయాలలో ఇంతవరకు స్పష్టమైన ఆధారం లేదు. కాకపోతే ఆమె స్వయంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఆమెను సారధిగా తప్పించడం వెనుక ఎటువంటి బలమైన కారణాలు లేవని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా ఆమెకు క్రికెట్ పెద్దలు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారని.. ఆమె మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని చెబుతున్నారు.
ఇటీవల హర్మన్ ఆధ్వర్యంలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. అంతకుముందు టీమిండియా తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచ కప్ అందుకుంది. ఆమె తన నాయకత్వ దశను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతనే.. తన బాధ్యతలను కొత్త తరానికి అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తర్వాత కెప్టెన్ ఎవరు
ప్రస్తుతం బీసీసీఐ అధికారికంగా కొత్త కెప్టెన్ పేరును ప్రకటించలేదు. కాకపోతే రేసులో ముందున్న పేరు మాత్రం స్మృతి మందన. మందాన చాలాకాలంగా డిప్యూటీ స్థానంలో కొనసాగుతోంది. హర్మన్ జట్టుకు దూరంగా ఉన్నప్పుడు ఆమె నాయకత్వం వహించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథిగా వ్యవహరించింది. గతంలోనే ఆమెను కెప్టెన్సీ పై విలేకరులు ప్రశ్నించినప్పుడు.. yes of course I am ready అంటూ సంకేతాలు ఇచ్చింది. అయితే కేవలం స్మృతి మాత్రమే కాదు. దీప్తి శర్మ.. జమీమా, రీఛాగోష్ వంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.