Bhaskar Reddy Arrest: సోషల్ మీడియా( social media) మాటున ప్రత్యర్ధులను వేధించే వారికి ఇది ఒక గుణపాఠమే. నిన్ననే భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైసిపి హయాంలో ప్రత్యర్థులను సోషల్ మీడియాలో ఉతికి ఆరేసేవాడు. ఆపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. అయితే దీని వెనుక పేదరికం అనే అంశం ఉంది. ఏదో డబ్బులు వస్తాయని ఆశించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు భాస్కర్ రెడ్డి. గత కొంతకాలంగా ఆయనపై నిఘా ఉంది. తండ్రి మరణంతో ఏపీకి వచ్చాడు. అంత్యక్రియలు, పెద్దకర్మ ముగిసిన వెంటనే పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. తమదైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ద్వారా పెద్ద ఎత్తున రాజకీయ ప్రయోజనం కోసం పోస్టులు పెట్టించిన వైసీపీ పెద్దలు.. ఇప్పుడు న్యాయ సహాయం చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. నిజంగా భాస్కర్ రెడ్డి వ్యవహారం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారికి ఒక గుణపాఠమే.
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…
* నిరుపేద కుటుంబం..
భాస్కర్ రెడ్డి ది( Bhaskar Reddy) నిరుపేద కుటుంబం. ఉపాధి కోసం ఆ కుటుంబం కృష్ణా జిల్లా చోడవరం వచ్చింది. భాస్కర్ రెడ్డి లండన్ వెళ్లి అక్కడ ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. సహజంగానే రాజశేఖర్ రెడ్డి అంటే పిచ్చి ప్రేమ.. ఆపై జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం పెరిగింది. సామాజిక వర్గం మాటున మరింత ప్రేమ పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పై. ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయనను అప్రోచ్ అయింది. డబ్బుల ఆశ చూపింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పై అభిమానం.. మరోవైపు డబ్బులు వస్తాయి అన్న ఆశతో వెనుక ముందు చూసుకోలేదు భాస్కర్ రెడ్డి. అనుచితమైన పోస్టులతో రెచ్చిపోయారు. చివరకు మహిళల పట్ల కూడా కనికరం చూపలేదు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.
* పట్టించుకోని వైసిపి..
గత రెండు రోజులుగా భాస్కర్ రెడ్డి పోలీసుల విచారణలో ట్రీట్మెంట్ ఎదుర్కొన్నట్లు స్పష్టం అవుతుంది. పోలీస్ స్టేషన్లతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ కనిపించారు భాస్కర్ రెడ్డి. అయితే ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి ఒకటో రెండో ట్వీట్లు వచ్చాయి. కనీసం న్యాయ సహాయం అందించేందుకు లాయర్లు కూడా లేరు. చివరకు ఆయన కుటుంబ సభ్యుల లాయర్లను ఏర్పాటు చేసుకొని న్యాయపోరాటం చేస్తున్నారు. నిజంగా ఇది దురదృష్టకరమే. భాస్కర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులుగా ఉన్నారు. కనీసం భాస్కర్ రెడ్డి పరిస్థితిని తెలుసుకొని వారంతా జాగ్రత్త పడటం మంచిది. లేకుంటే వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వారంతా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక తేల్చుకోవాల్సింది వారే.