YSRCP on Padma Awards: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఆ పార్టీ ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా ప్రభుత్వంపై విమర్శించేందుకు ఎంత మాత్రం వెనుకడుగు వేయడం లేదు. చివరకు కేంద్ర ప్రభుత్వంపై కూడా అనుమానపు చూపులు పెరిగేలా ప్రజల్లో విష బీజాలు నింపుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా వైసీపీ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు లాంటివారు సైతం సరికొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారు. వైసిపిని పూర్తిగా దెబ్బతీసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మోడీ సర్కారుదని కొత్త పల్లవి అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని తన కుహనా మేధావితనంతో చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలపై కూడా విషం చిమ్ముతున్నారు. అమరావతి రాజధాని మాదిరిగా.. ఒక కులం పేరును ప్రస్తావిస్తూ.. సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాదులకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పద్మ పురస్కారాలు విషయంలో అభినందనలు అందుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కేవలం కళ, సేవ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని పద్మశ్రీ ఎంపికలను చేస్తోంది కేంద్రం. చివరకు రాజకీయ ప్రత్యర్థులకు సైతం ఈ ఏడాది పద్మ పురస్కారాలను ప్రకటించింది. అటువంటి ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియాతో పాటు సోషల్ మీడియా.
తెలుగు ప్రముఖులకు పురస్కారాలు..
ఈ ఏడాది 11 మంది తెలుగు ప్రముఖులకు పద్మ పురస్కారాలు( Padma awards ) లభించాయి. అందులో సినిమా రంగం నుంచి మురళీమోహన్ తో పాటు రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఇందులో మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుంచో ఉన్నారు. ఒకసారి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతగా మాత్రం కొనసాగుతున్నారు. ఆయనను ఎంపిక చేయడానికి ఇప్పుడు తప్పుపడుతోంది వైసీపీ మీడియా. ఇక తన హాస్యంతో, సెంటిమెంట్తో ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయనను సైతం తెలుగుదేశం పార్టీతో పాటు ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తూ ప్రచారం మొదలుపెట్టింది వైసిపి. ఎంతోమంది నటులు ఉండగా వారిద్దరికీ మాత్రమే ఎందుకు పద్మశ్రీ అని ప్రశ్నిస్తోంది. మరి అదే జరిగితే ఎన్టీఆర్ విషయంలో ఏమనాలి? వైసిపి హయాంలో సిఫార్సులను ఏమనాలి?
విమర్శకులు సైతం అభినందనలు..
వాస్తవానికి పద్మ పురస్కారాలు ఎంపికలో ఎటువంటి రాజకీయ సిఫార్సులకు తావు లేదని.. పూర్తి పారదర్శకంగా జరుగుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విమర్శకులు సైతం పద్మ పురస్కారాల ఎంపికపై అభినందనలు తెలుపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ వైరుధ్యం ఉన్నా.. కేరళ మాజీ ముఖ్యమంత్రితో పాటు ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సొరేన్ కు సైతం పద్మశ్రీ అవార్డులు దక్కాయి. గతంలో కాంగ్రెస్ సైయాంలో పద్మ అవార్డుల ఎంపికలో రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేసే వారన్న విమర్శ ఉంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్న టాక్ ఉంది. అయినా సరే తెలుగు సినిమా నటుల విషయంలో కులం పేరు చెప్పి వైసిపి విషప్రచారం మొదలుపెట్టింది.