Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్Raptadu Incident: రాప్తాడు దుర్మార్గుడి పాపం పండింది.. పోలీసులు ఏం చేశారంటే..

Raptadu Incident: రాప్తాడు దుర్మార్గుడి పాపం పండింది.. పోలీసులు ఏం చేశారంటే..

Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో శనివారం 10వ తరగతి చదివే బాలిక మీద హేమంత్ అనే దుర్మార్గుడు తరగతి గదిలో చెట్లు కోసే రంపం తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. అతడు రంపంతో కోయడంతో ఒక చేయి విరిగింది. ముఖం మీద.. అనేక ప్రాంతాలలో తీవ్రంగా గాయాలయ్యాయి. రక్త స్రావం కూడా అధికంగా జరిగింది. మొదట్లో స్థానికంగా చికిత్స అందించినప్పటికీ.. అత్యవసర వైద్యం అందించాల్సి రావడంతో […]

Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో శనివారం 10వ తరగతి చదివే బాలిక మీద హేమంత్ అనే దుర్మార్గుడు తరగతి గదిలో చెట్లు కోసే రంపం తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. అతడు రంపంతో కోయడంతో ఒక చేయి విరిగింది. ముఖం మీద.. అనేక ప్రాంతాలలో తీవ్రంగా గాయాలయ్యాయి. రక్త స్రావం కూడా అధికంగా జరిగింది.

మొదట్లో స్థానికంగా చికిత్స అందించినప్పటికీ.. అత్యవసర వైద్యం అందించాల్సి రావడంతో ఆ బాలికను బెంగళూరు తరలించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మణి పాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు దాదాపు 12 గంటల పాటు శ్రమించి ఆమెకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏప్పటికప్పుడు మాట్లాడారు. బాలికకు అందుతున్న వైద్యం గురించి సంప్రదింపులు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత బాలికను నారా లోకేష్ పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ దారుణానికి పాల్పడిన హేమంత్ శనివారమే పోలీసులకు చిక్కాడని వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం సాయంత్రం దాటిన తర్వాత ఆ దుర్మార్గుడికి సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అయ్యాయి. హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నాడని.. పోలీసులు అతడిని పట్టుకునే క్రమంలో ఎదురు తిరిగాడని.. ఈ నేపథ్యంలో పోలీసులు అతని మీద కాల్పులు జరిపారని తెలుస్తోంది. దాదాపు 6 రౌండ్ల పాటు అతని మీద కాల్పులు జరిపారని సమాచారం. పోలీసుల కాల్పుల వల్ల హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారని ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటన జరిగిన తర్వాత హేమంత్ ను ఎన్కౌంటర్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. నిన్న ఘటన జరిగిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అటువంటి వ్యక్తులకు బతికే అవకాశం లేదని.. సమాజంలో మృగాల కంటే హీనంగా వ్యవహరిస్తున్న హేమంత్ లాంటి వ్యక్తులు బతకకూడదని.. సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ మొత్తం ఆ బాలికను ప్రాణాపాయం నుంచి బయటికి తీసుకొచ్చే దానిమీద మాత్రమే ఉంది. అయితే పోలీసు వ్యవస్థ హేమంత్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. అతని మీద ఈ లోగానే పోలీసులు కాల్పులు జరపడం విశేషం. నిన్నటి ఘటన నేపథ్యంలో సీన్ రీ కన్ స్ట్ర క్షన్ చేస్తుండగా,అతడు పారిపోవడానికి ప్రయత్నించాడని, అందువల్లే పోలీసులు కాల్పులు జరిపారని సమాాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper