Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: కాపులు యూటర్న్.. పవనే అజెండా!

Pawan Kalyan: కాపులు యూటర్న్.. పవనే అజెండా!

Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు కాపు అనే అంశం చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అది ఇప్పుడు కాదు. గతం నుంచి వస్తున్నదే. దానికి కారణం కాపుల మద్దతు ఏ పార్టీకి స్థిరంగా ఉండదు. ఆ సామాజిక వర్గం మద్దతు ఇస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపుల అంశమే ప్రధానంగా పనిచేస్తూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఉండడంతో కాపులంతా కూటమి వైపు నడిచారు. అందుకే వైసిపి దారుణంగా […]

Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు కాపు అనే అంశం చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అది ఇప్పుడు కాదు. గతం నుంచి వస్తున్నదే. దానికి కారణం కాపుల మద్దతు ఏ పార్టీకి స్థిరంగా ఉండదు. ఆ సామాజిక వర్గం మద్దతు ఇస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపుల అంశమే ప్రధానంగా పనిచేస్తూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఉండడంతో కాపులంతా కూటమి వైపు నడిచారు. అందుకే వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే కాపులను వెనక్కి తీసుకురావడానికి వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు.

* వివాదం చేయాలని..
రాష్ట్రవ్యాప్తంగా కాపుల అంశానికి సంబంధించి ఏ వివాదాన్ని విడిచి పెట్టేందుకు వైసీపీ అంగీకరించడం లేదు. సాయి కృష్ణ ఘటనను మరింత వివాదాస్పదం చేసి కాపులను దూరం చేయాలని చూసింది కూటమి నుంచి వైసీపీ. కానీ ఆ ప్రయత్నం కూడా వికటించింది. సాయి కృష్ణ కుటుంబం వైసీపీ రాజకీయానికి చిక్కలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వెనువెంటనే అది లాకప్ మారడం అని తేల్చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు అవకాశం లేకుండా చేశారు.

* కాపుల మద్దతు సభ..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపుల పేరుతో సభలను ఏర్పాటు చేసి చీలిక తేవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే కొత్తగా ఆ కాపుల సభకు వచ్చిన కాపు నేతలు, పెద్దలు ఎవరూ లేకుండా పోయారు. అయితే నిన్న విజయవాడలో కాపుల సభ జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు, వివిధ రంగాల్లో పనిచేసిన నిపుణులు ఏకతాటి పైకి వచ్చారు. ఒక క్రమ పద్ధతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని.. ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం కాపు సామాజిక వర్గానికి ఉందని తేల్చి చెప్పారు. ఒక వ్యూహం ప్రకారమే డిప్యూటీ సీఎం స్థాయికి పవన్ వెళ్లగలిగారని.. ఆయన ద్వారా కాపుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకుందామని వారు చెప్పడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper