Homeఆంధ్రప్రదేశ్‌Vidadala Rajini: చిలకలూరిపేటలో బ్లాక్ డే.. రీపోలింగ్ చేయాల్సిందేనట..

Vidadala Rajini: చిలకలూరిపేటలో బ్లాక్ డే.. రీపోలింగ్ చేయాల్సిందేనట..

Vidadala Rajini: ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొన్ని సంఘటనలు మినహా మిగతా ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కును అత్యంత స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగింది. జగన్ రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెళ్ళిపోయారు. జగన్ తర్వాత అదే స్థాయిలో […]

Vidadala Rajini: ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొన్ని సంఘటనలు మినహా మిగతా ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కును అత్యంత స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగింది. జగన్ రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెళ్ళిపోయారు.

జగన్ తర్వాత అదే స్థాయిలో తన స్వరాన్ని నిరసనస్వరంగా వినిపిస్తున్నారు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక కీలక విషయాలను బయటపెట్టారు. చిలకలూరిపేటలో టిడిపి నాయకులు దౌర్జన్యం చేశారట. ఓటర్లను ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోనివ్వలేదట. తీవ్రంగా ఇబ్బందులు పెట్టారట. ఒకరకంగా ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అట. చిలకలూరిపేటలో బ్లాక్ డే అట.. స్థానిక ఎన్నికల్లో టిడిపి కూటమి విర్రవీగుతోందని.. అసలు ఇది గెలుపే కాదని.. రజిని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పోలీసులు.. ఇతర అధికారులు టిడిపి నాయకులకు సహకారం అందించారట.. అందువల్లే చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందట.

సాక్షి రిపోర్టర్ మీద పోలీసులు దాడి చేశారట.. సాక్షి రిపోర్టర్ ఫోన్ లాక్కున్నారట. తీవ్రంగా వేధింపులకు గురి చేశారట. ఒకవేళ రజిని చెబుతున్నట్టు ఇవన్నీ నిజాలే అయితే.. తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు లేదా అధికారులు ఇబ్బంది పెడితే ఓటర్లు ఊరుకోరు కదా.. ధర్నా చేస్తారు కదా.. మరి అలాంటి సంఘటనలు చిలకలూరిపేటలో జరగలేదు కదా అని టిడిపి నేతలు అంటున్నారు. అధికారం చెప్పడం.. చివరికి ఎన్ని రకాలుగా సింపతి డ్రామాలు ప్లే చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రజిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను పెట్టిన ఇబ్బందులు.. క్వారీ యజమానుల దగ్గర వసూలు చేసిన డబ్బులు.. ఇతర వ్యవహారాలు అందరికీ గుర్తే ఉన్నాయని.. గతంలో విడదల రజిని తన పీఏని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఎలాంటి డ్రామాలు ఆడింది అందరికీ తెలుసు అని టిడిపి నేతలు అంటున్నారు. విలేకరుల సమావేశం పెట్టినంతమాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోవని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.

ఇటీవల ఒక పోలీసు అధికారి తో వాగ్వాదం పెట్టుకొని.. తనే కింద పడిపోయి.. చివరికి ఎన్నికల్లో సింపతి డ్రామా ఆడేందుకు రజని ప్రయత్నించారని.. అది వర్కౌట్ కాలేదని.. అందువల్లే ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని టిడిపి నేతలు అంటున్నారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో చిలకలూరిపేటలో ప్రజలు టిడిపికి జై కొట్టారని.. స్థానిక ఎన్నికల్లో కూడా అదే ఫలితం వస్తుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటికైనా రజిని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper