Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు.. ఆ కీలక భేటీ వెనుక?!

Chandrababu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు.. ఆ కీలక భేటీ వెనుక?!

Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు రాజకీయంగాను హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ, కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన నేపథ్యంలో నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆయన […]

Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు రాజకీయంగాను హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ, కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన నేపథ్యంలో నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆయన పైనే ఉంది. తిరుమల లడ్డు కు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం పైనే నేషనల్ మీడియాలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తుండడం విశేషం.

* ఒకరోజు పర్యటన నిమిత్తం..
ఒకరోజు పర్యటన నిమిత్తం చంద్రబాబు ఢిల్లీ(Delhi) వెళ్లారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో భాగంగా ఐదుగురు కేంద్ర మంత్రులతో భేటీకి అవకాశం ఉంది. నేరుగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు కేంద్రమంత్రి సి ఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్, జల జీవన్ మిషన్ పథకానికి నిధులు వంటి వాటిపై చర్చించారు. అనంతరం వరుసగా నిర్మల సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్విని వైష్ణవ్ లతో భేటీ అవుతారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో కీలక భేటీ ఉంటుందని.. ప్రధాని నరేంద్ర మోడీని సైతం కలుస్తారని ఒక ప్రచారం అయితే మాత్రం ఉంది.

* రాజకీయ అంశాలపై చర్చ..
అన్నింటికీ మించి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను( Central Home minister Amit Shah) సీఎం చంద్రబాబు కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా నెయ్యి కల్తీ వ్యవహారం అనేది ఏపీలో పెను ప్రకంపనలకు దారితీసింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో లడ్డు తయారీకి సంబంధించి.. నెయ్యిలో జంతువు కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. దానిని తిప్పుకొట్టేందుకు మొన్ననే మూడు పార్టీల నేతలు ఉమ్మడిగా సమావేశం అయి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారు. ఇప్పుడు చంద్రబాబు నేరుగా వెళ్లి చర్చలు జరుపుతున్నారు. అక్కడినుంచి అనుమతులు తీసుకున్న వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉంది కూటమి. అయితే ఏపీ వ్యవహారాల్లో అమిత్ షా ఇచ్చే సూచనలు, కూటమి పార్టీల వ్యూహాలు తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper