Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu New Strategy: కొత్త ఆలోచనతో చంద్రబాబు!

CM Chandrababu New Strategy: కొత్త ఆలోచనతో చంద్రబాబు!

CM Chandrababu New Strategy: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. మరో నాలుగు నెలల్లో నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. కచ్చితంగా ఆ నాలుగు సీట్లు కూటమికి దక్కనున్నాయి. ఇనపద్యంలో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజ్యసభ పదవులు అంటే ఎక్కువగా పారిశ్రామికవేత్తలకే కేటాయిస్తారు. అయితే ఈసారి వారికి కాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే నడిచిన యువ నేతలకు, సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయాలని టిడిపి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.

* చింతకాయల విజయ్ కు ఛాన్స్..
ఈసారి యువనాయకత్వానికి రాజ్యసభ ( Rajya Sabha )పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. పార్టీలోనే ఐటీ వింగ్ బాధ్యతలను చూస్తూ.. సోషల్ మీడియా వేదికగా అప్పటి వైసిపి ప్రభుత్వం పై పోరాడిన చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపి ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ కు అత్యంత విధేయుడు విజయ్. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు. ఉత్తరాంధ్ర నుంచి బీసీ యువనేతగా మంచి గుర్తింపు పొందారు. తండ్రి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడతారు అన్న పేరు ఉంది. ఇప్పటికీ అదే దూకుడుతో కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు రాజ్యసభ పదవి దక్కి చాన్స్ కనిపిస్తోంది.

* లోకేష్ సన్నిహితులు..
మరోవైపు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్( killaru Rajesh ) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. లోకేష్ టీంలో రాజేష్ ఒకరు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా రాజేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈసారి ఎలాగైనా రాజ్యసభ పదవి ఆయనకు ఇస్తారని తెలుస్తోంది. ఇంకోవైపు రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేస్తున్న సానా సతీష్ సైతం లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొనసాగింపు ఉంటుందని కూడా ప్రచారం నడుస్తోంది. మరోవైపు మహాసేన రాజేష్ సైతం రాజ్యసభ పదవి ఆశిస్తుండగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చేజారిపోయింది. అందుకే ఈసారి మహాసేన రాజేష్ ఎంపిక ఉంటుందని కూడా తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని నేతలకు పదవులు కట్టబెట్టేందుకు చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular