spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Fee Reimbursement Release: విద్యాలోకానికి లోకేష్ గుడ్ న్యూస్.. హాట్సాఫ్ చెప్పాల్సిందే!

AP Fee Reimbursement Release: విద్యాలోకానికి లోకేష్ గుడ్ న్యూస్.. హాట్సాఫ్ చెప్పాల్సిందే!

AP Fee Reimbursement Release: ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్( reimbursement నిధులను విడుదల చేసింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని గత కొద్ది రోజులుగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతూ వచ్చారు. ఆ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు. రూ.1198 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైసిపి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉండేవి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు విడుదల చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఒకే విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిడిపి కూటమి హయాంలో రియంబర్స్మెంట్ నిధులన్నీ విడుదల కావడంతో సంతృప్తి కనిపిస్తోంది.

* గత అసెంబ్లీ సమావేశాల్లో..
గత అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నిధులు విడుదల చేయాలని కోరారు. మంత్రి నారా లోకేష్ శాసనమండలి వేదికగా ఫీజు రియంబర్స్మెంట్ అంశం గురించి మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టిందని చెప్పుకొచ్చారు.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం దశలవారీగా చెల్లించడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి చేయవద్దని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు లోకేష్. విద్యార్థులను తరగతులకు హాజరుకానివ్వకుండా చేయడం, హాల్ టికెట్లను నిలిపివేయడం, పరీక్ష హాలు లోకి అనుమతించకపోవడం వంటి ఏదైనా బలవంతపు చర్యలకు పాల్పడడం చట్టవిరుద్దమని అప్పట్లోనే మంత్రి లోకేష్ గట్టిగానే హెచ్చరికలు జారీచేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై కీలక ప్రకటన చేశారు.

* సింపుల్ గా ట్విట్టర్ ద్వారా..
అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి హడావిడి చేయలేదు.. ఇదే గత ప్రభుత్వ హయాంలో అయివుంటే పత్రికల్లో ప్రకటనలతో హోరెత్తించేది. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా దీవెన పథకంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఆ నిధులను చాలామంది కుటుంబ అవసరాల కోసం వాడుకున్నారు. కళాశాలలకు ఫీజులు చెల్లింపులు జరగలేదు. ఫలితంగా విద్యాసంస్థల్లో వేలకోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయే పరిస్థితి దాపురించింది.

* నేరుగా కాలేజీల ఖాతాల్లో..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఫోకస్ పెట్టింది. గతంలో మాదిరిగా కాకుండా.. ఆ నిధులను నేరుగా కాలేజీ ల ఖాతాల్లోకి జమ చేసేలా విధానపరమైన మార్పులు చేపట్టింది. తాజాగా విడుదల చేసిన 1200 కోట్ల రూపాయలతో పాత బకాయిలతో పాటు.. ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్ చేస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి.. విద్య విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దు. పాత బకాయిలను తీర్చి.. ఇకపై సకాలంలో నిధులు అందేలా చూడడమే మా లక్ష్యం. మీరు ధైర్యంగా చదువుకోండి. మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు. వైసిపి హయాంలో గాడి తప్పిన విద్యావ్యవస్థను సరిచేసే పనిలో లోకేష్ చూపుతున్న చొరవ అభినందనలు అందుకుంటోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper