Mlc duvvada srinivas : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో కీలక ట్విస్ట్. ఎమ్మెల్సీ దువ్వాడ, ఆయన సన్నిహితురాలు మాధురి, భార్య దువ్వాడ వాణి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీ మరో మలుపు తిరిగింది. మాధురితో తాను నివాసం ఉంటున్న ఇంటి విషయంలో భార్య దువ్వాడ వాణి, పిల్లల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో శ్రీనివాస్ నోరు విప్పారు. ఆ ఇంటి విషయంలో ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు సన్నిహితురాలు మాధురి ఫోన్ చేశారు. ఫోన్లోనే ఆమెకు ఇంటిపై దువ్వాడ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను రెండు కోట్లు అప్పుగా ఉన్నానని.. ఇంటి నిర్మాణంతోపాటు రాజకీయ అవసరాల కోసం ఆ డబ్బు వాడుకున్నట్లు చెప్పుకొచ్చారు. చింతాడ పార్వతీశం అనే వ్యక్తికి సైతం60 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు. అందుకే తన కొత్త ఇల్లు మాధురికి చెందుతుందని సంకేతాలు ఇచ్చారు దువ్వాడ. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఈ వివాదం యు టర్న్ తీసుకుంది.
* వ్యాపారాల్లో నష్టం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా దువ్వాడ దూకుడుగా ఉండేవారు. ఎమ్మెల్సీ పదవితో పాటు టెక్కలి ఇన్చార్జిగా ఉంటూ కింజరాపు కుటుంబానికి తరచూ సవాల్ చేసేవారు. రాజకీయాల్లో ఉంటూనే క్వారీ వ్యాపారాలు నడిపేవారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఆ వ్యాపారాలన్నీ మూత పడినట్లు చెబుతున్నారు. తనకు కేవలం ఈ ఇల్లు మాత్రమే ఆస్తిగా ఉందని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటిని కూడా అప్పు కింద ఇచ్చేసినట్లు సంకీర్తన పంపించారు దువ్వాడ.
* ఆ ఇంటిలో వాణికి ప్రవేశం లేదు
మరోవైపు తన ఆస్తి అని చెబుతున్న ఇంటిలో దువ్వాడ వాణికి ప్రవేశం లేదని మాధురి తేల్చి చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారని మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణలీకేజీలో వాణి సూత్రధారి అని ఆరోపించారు. ఏఐ వాయిస్ రికార్డ్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆ దంపతుల మధ్య విభేదాలు ఉన్న విషయాన్ని మాధురి ప్రస్తావిస్తున్నారు.
* అర్ధరాత్రి ఇల్లు ఖాళీ
అయితే ఇంటి విషయంలో దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇవ్వడంతో.. దువ్వాడ వాణి, ఆమె పిల్లలు ఇంటిని ఖాళీ చేశారు. మాధురి ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు అదే ఇంటిని పార్టీ కార్యక్రమాల నిర్వహణకు దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకు ఇస్తానని మాధురి ప్రకటించారు. మొత్తానికైతే ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More