spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం... నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ ల వ్యవహారాలు వంటి వాటిలోనే వైసీపీ నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కేసులు నడిచేవి. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు వ్యక్తిగత వైఖరి కారణంగా కేసులకు గురవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరారు వైసీపీ సీనియర్ నేత, టిటిడి మాజీ అధ్యక్షుడు భూమున కరుణాకర్ రెడ్డి. ఏకంగా నదిలోని భూమిని కలుపుకొని కబ్జా చేశారు. అడ్డంగా బుక్ కావడంతో దానిని రాజకీయ కక్ష సాధింపు అని వర్ణిస్తున్నారు.

* అనవసరంగా అరెస్టు వరకు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. ఆయన కుమారుడు బైక్ డ్రైవింగ్ కారణంగా ఒక గొర్రెల కాపరి మృతి చెందారు. బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన గొర్రెల కాపరిని అలానే విడిచిపెట్టి.. తన కుమారుడి స్థానంలో వేరే వ్యక్తిని చూపించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. పోలీస్ విచారణలో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఆయన అరెస్ట్ సైతం జరిగిపోయింది. తమ్మినేని సీతారాం గురించి చెప్పనవసరం లేదు. బతికున్న భూ యజమాని చనిపోయినట్టు చూపి.. ఆయన వారసుల పేరుతో నకిలీ మనుషులు, నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసి.. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని తన కుమారుడు పేరుతో రాయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమ్మినేని ఫ్యామిలీ అక్రమ పర్వాన్ని బయటపెట్టారు. అరెస్టు భయంతో తమ్మినేని ఫ్యామిలీ ప్రస్తుతం పరారీలో ఉంది.

* నది భూమి ఆక్రమణ..
ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన ఏకంగా స్వర్ణముఖి నది భూమిని ఆక్రమించేశారు. ఇప్పుడు అధికారులకు ఫిర్యాదులు రావడంతో పరిశీలించి ఆక్రమణ అని తేల్చారు. ఏకంగా ఫెన్సింగ్ వేయగా దానిని తొలగించి ప్రభుత్వ భూమిగా నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఇన్ని రోజులు కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. కానీ అటువంటి నేత తనకు ఉన్న అధికార బలంతో ఏకంగా నది భూమిని ఆక్రమించుకోవడం వెలుగులోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వంపై ఫ్యాక్షన్ తరహాలో ముద్ర వేస్తున్నారు. అప్పట్లో ఫ్యాక్షన్ నాయకులు ప్రత్యర్థుల భూములను నాశనం చేసిన మాదిరిగా.. కూటమి ప్రభుత్వం తన ఆస్తులను ధ్వంసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే అది తన భూమి అని.. నిబంధనల ప్రకారమే ఆ భూమి తన చెప్పు చేతల్లో ఉంది అని చూపించలేకపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే అప్పలరాజు మాదిరిగా అరెస్టుల వరకు తెచ్చుకుంటున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
Oktelugu Epaper