spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Ayyannapatrudu: టిడిపి సీనియర్ పొలిటికల్ రిటైర్మెంట్!

Ayyannapatrudu: టిడిపి సీనియర్ పొలిటికల్ రిటైర్మెంట్!

Ayyannapatrudu: తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరు పక్కకు తప్పుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు ఈ ఎన్నికల్లో చాలామంది తప్పుకున్నారు. తమ వారసులకు ఛాన్స్ ఇచ్చారు. పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, గౌతు శివాజీ, టీజీ వెంకటేష్, జెసి దివాకర్ రెడ్డి.. ఇలా చాలామంది పక్కకు తప్పుకున్నారు. వయోభారంతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ తెర వెనుక మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. అయితే తాజాగా టిడిపిలో ఒక బిగ్ షాట్ తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఇక చాలు అని ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు చెప్పేశారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. దీంతో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఆయన ఎవరో కాదు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గత కొంతకాలంగా ఆయన కుమారుడు విజయ్ పాత్రుడు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. దీంతో కుమారుడికి లైన్ క్లియర్ చేసేందుకేనని తెలుస్తోంది. అయితే అయ్యన్నపాత్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటన ఇప్పటిది కాదు. 2019 ఎన్నికల్లోనే తాను పోటీ చేయనని.. కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కానీ ఆ ఎన్నికలు కీలకము కావడంతో చంద్రబాబు ఒప్పించడంతో పోటీ చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ చంద్రబాబు ఒప్పుకోకపోయేసరికి పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. రాజ్యాంగబద్ధ పదవి అయిన స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. అప్పటినుంచి హుందాగా నడుచుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అయ్యన్నపాత్రుడు ప్రకటించడం విశేషం.

* నర్సీపట్నం ఎమ్మెల్యేగా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు అయ్యన్నపాత్రుడు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అయ్యన్నపాత్రుడు. సుదీర్ఘకాలం నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 1996లో అనకాపల్లి నుంచి టిడిపి ఎంపీగా గెలిచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అయ్యన్న మంత్రి అయ్యారు. ఈసారి కూడా చంద్రబాబు సర్కార్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అనూహ్యంగా స్పీకర్ పదవి దక్కింది.

* కుమారుడి కోసమే
నర్సీపట్నం నుంచి తన కుమారుడు విజయ్ పాత్రుడిని పోటీ చేయించాలని ఆలోచనతో ఉన్నారు అయ్యన్న. గత కొంతకాలంగా విజయ్ మంచి సేవలు అందిస్తున్నారు. తండ్రి వలె దూకుడు కలిగిన నేత కూడా. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి సేవలందించారు విజయ్. మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా. భవిష్యత్తులో లోకేష్ టీమ్ లో విజయ్ ఒకరుగా ప్రచారం జరుగుతోంది. కుమారుడికి లైన్ క్లియర్ చేసేందుకే అయ్యన్నపాత్రుడు రిటైర్మెంట్ ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే వచ్చే ఎన్నికల నాటికి టిడిపిలో ఒక సీనియర్ క్రియాశీలక రాజకీయాలకు దూరమైనట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Oktelugu Epaper