Homeఆంధ్రప్రదేశ్‌Talliki Vandanam Scheme: తల్లికి వందనం.. అనర్హత జాబితాలో ఉంటే అలా చేయాలి!

Talliki Vandanam Scheme: తల్లికి వందనం.. అనర్హత జాబితాలో ఉంటే అలా చేయాలి!

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం ఏకంగా 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నెల […]

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం ఏకంగా 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నెల 22న నేరుగా డిబిటి ద్వారా నగదు జమ చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 22 నుంచి నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది.

* ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే..
ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13 వేల రూపాయల చొప్పున సాయం అందం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు గాను.. 42,70, 802 మంది తల్లులు / సంరక్షకులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుంది. ప్రతి విద్యార్థికి 15వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుండగా.. అందులో 2000 చొప్పున పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి కోసం కేటాయించారు. మిగిలిన మొత్తం 13 వేలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

* జాబితాల ప్రదర్శన..
ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను సచివాలయాల వారిగా ప్రదర్శించునున్నారు. ఒకవేళ అనర్హత జాబితాలో ఉంటే అందుకు గల కారణాలను చెప్పనున్నారు. సాంకేతిక సమస్యలు సరిచేసి లబ్ధిదారులకు నగదు అందించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. కొత్తగా ఒకటో తరగతి, తొమ్మిదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారి అర్హతలను పరిశీలించి ఆగస్టు 30న అదనపు లబ్ధిదారుల జాబితా విడుదల చేసి.. అదే రోజు వారి తల్లుల ఖాతాల్లో కూడా ఆర్థిక సాయం జమ చేయను. మరోవైపు అంగన్వాడి, పారిశుద్ధ్య సిబ్బంది పిల్లలకు సైతం ఈ ఏడాది తల్లికి వందనం పథకం వర్తించనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper