Andhra Pradesh Politics: ఏపీలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు లేవు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఈ తరుణంలో మరోసారి అధికారంలోకి వస్తామని వైసిపి భావిస్తోంది. తగ్గేదిలే అంటోంది కూటమి. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని.. అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని.. అందుకే మరోసారి అధికారంలోకి వస్తామని కూటమి ధీమాతో ఉంది. ఇంకోవైపు ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిన దృష్ట్యా.. తాము అధికారంలోకి వస్తామని వైసిపి చెప్పుకొస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఒక ప్రముఖ సంస్థ ఏపీలో ప్రజల మూడ్ పై సర్వే చేసింది. తన సర్వే ఫలితాలను వెల్లడించింది. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* ప్రముఖ సర్వే సంస్థ..
పయనీర్ స్ట్రాటజీ సంస్థ రాజకీయ సర్వేలు చేపడుతూ వస్తోంది. గతంలో ఎగ్జిట్ పోల్స్, ప్రీపోల్స్ సర్వేలను చేపట్టింది. వాస్తవానికి దగ్గరగా ఫలితాలు ఇస్తుందన్న మంచి పేరు ఉంది. ఈ క్రమంలో ఏపీలో కూటమిపాలన రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రజల మూడ్ ను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. ఈ సర్వేలో అది తేలింది. అయితే ఈ వ్యతిరేకత వైసిపి దక్కించుకోలేదు సరి కదా.. ఉన్న గ్రాఫ్ ను సైతం కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అన్నింటికీ మించి వైసిపి గ్రాఫ్ తగ్గిపోగా.. ఏ నిర్ణయం తీసుకోలేక.. తటస్తులుగా ఉండిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది.
* ఒక్కసారిగా తగ్గిన గ్రాఫ్..
శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయిందని తెలుస్తోంది. రాయలసీమలో స్వల్పంగా వైసిపి గ్రాఫ్ పెరిగినట్లు స్పష్టం అవుతుంది. ఏపీలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ఆధిక్యంలో ఉంటుంది. ఈ సర్వేలో కూటమికి సుమారు 49% ఓటు దక్కే అవకాశం ఉంది. కానీ వైసీపీ ఓటు బ్యాంకు ఏకంగా 28 శాతానికి పడిపోయినట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. మరో 23 శాతం మంది ప్రజలు ఇంకా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదని చెబుతుండడం గమనార్హం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఇంకా ప్రజలు నమ్ముతుండడం ఈ సర్వే ద్వారా తేలింది. చాలా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. అయితే అనూహ్యంగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపని 23 శాతానికి పైగా ఓటర్లు ఉండడం విశేషం. అయితే రెండేళ్ల కూటమిపాలనపై ప్రజలు సంతృప్తి చెందుతున్నట్లు మాత్రం ఈ సర్వే తేల్చింది. అయితే ఈ సర్వేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు. అధినేత జగన్ తో పాటు కొంతమంది నేతల వైఖరి అస్సలు బాగోలేదని.. దాని పర్యవసానాలు ఈ సర్వే ఫలితాలు అని నమ్ముతున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికైతే షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం.