Homeబిజినెస్Oppo K 14 X 5G: 6500 mAh బ్యాటరీ, 50 mp కెమెరా.. ఇంత...

Oppo K 14 X 5G: 6500 mAh బ్యాటరీ, 50 mp కెమెరా.. ఇంత తక్కువ ధరలోనా?

Oppo K 14 X 5G: స్మార్ట్ ఫోన్ లు రోజురోజుకు అత్యంత ఆధునికమైనవిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చే నేపథ్యంలో కంపెనీలు.. కొత్త కొత్త ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ లో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే కంపెనీలు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో అత్యంత ఆధునికమైన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఇలా కాలానికి […]

Oppo K 14 X 5G: స్మార్ట్ ఫోన్ లు రోజురోజుకు అత్యంత ఆధునికమైనవిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చే నేపథ్యంలో కంపెనీలు.. కొత్త కొత్త ప్రయోజనాలను కల్పిస్తున్నాయి.

ఇండియన్ మార్కెట్ లో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే కంపెనీలు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో అత్యంత ఆధునికమైన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఇలా కాలానికి తగ్గట్టుగా ఫోన్లను రూపొందించి విక్రయించే కంపెనీలలో ఒప్పో ముందు వరుసలో ఉంటుంది.

ఒప్పో కంపెనీ తాజాగా oppo k14 x 5G పేరుతో ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 6,500mAh బ్యాటరీ ఉంది. 50 మెగాపిక్సల్ కెమెరా అందుబాటులో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఈ ఫోన్ కు ఉంది. 120Hz డిస్ ప్లే ఉంది. మీడియా టెక్ డైమన్ సిటీ 6300 చిప్ సెట్ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ 4 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర 14,999 నుంచి లభిస్తుంది. 6 జిబి రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 16,999 వరకు లభిస్తుంది. ఈ ఫోన్ ను ఫిబ్రవరి 16 నుంచి ఆన్లైన్లో అమ్మకానికి పెడతామని ఒప్పో కంపెనీ పేర్కొంది. ఐ సి బ్లూ, ప్రిసీ వైట్ కలర్లో అందుబాటులో ఉంటుంది. ఎంపిపి చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి 1500 తక్షణ తగ్గింపు లభిస్తుంది . మూడు నెలల లో కాస్ట్ ఇఎంఐ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. డిస్కౌంట్ల తర్వాత ఈ ఫోన్ 13, 499 నుంచి 15,499 ధరలలో లభిస్తుంది.

Oppo k14 x 5G ఫోన్ 6.75 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. 120 Hz రీ ఫ్రెష్ రేట్ తో లభిస్తుంది. 1125 note వరకు పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఇది దుమ్ము ధూళి, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. IP 64 రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 45 W ఫాస్ట్ ఛార్జింగ్ తో 6500 mAh బ్యాటరీని చార్జింగ్ చేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper