AP DSC 2026 : వెనుకటికి ఒక సామెత ఉంది.. నేను గాని లేచాను అంటే.. ఊరుకోను అన్నాడట. సేమ్ ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసిపి పరిస్థితి కూడా ఇలానే ఉంది. అసలు ఆ పార్టీ అధినేత ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఇక కింది స్థాయి నాయకులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతున్నప్పటికీ.. అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గట్టి పట్టుదలతో డీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలను చేపట్టారు. ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ఉద్యోగాలు సాధించిన వారిలో చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారే.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీఎస్సీ సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏపీ రాష్ట్రంలో చాలావరకు పోస్టులు భర్తీ కాకుండా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి పగడ్బందీ విధానాలను అవలంబించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీఎస్సీ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు. పైగా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తే.. దానిని స్వాగతించకపోగా అందులో జగన్ రంధ్ర అన్వేషణ చేశారు. అంతేకాదు ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. నిరుద్యోగ యువకులలో లేనిపోని భయాలను కలుగజేశారు. ఇక జగన్ తీరు తట్టుకోలేక చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తాము సక్రమంగా ఉద్యోగాలు సాధించామని.. వైసిపి వల్ల తమకు నిద్రలేని రాత్రులు ఉంటున్నాయని డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారు పేర్కొన్నారు. అంతే కాదు ప్రఖ్యాత కొండారెడ్డి బురుజు వద్ద ఏపీ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన సరికొత్త చర్చకు దారి తీసింది.
ఇప్పుడు వైసిపి.. ఆ పార్టీ అనుకూల మీడియా మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. సర్టిఫికెట్లు సక్రమంగా వెరిఫికేషన్ చేయలేదని.. స్పోర్ట్స్ కోటాలో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని.. అవినీతికి ఆస్కారం ఇచ్చారని ఆరోపించడం మొదలు పెట్టింది. ఈ విషయంలో అధికారులు క్లారిటీ ఇచ్చినప్పటికీ వైసీపీ లోకేష్ మీద.. కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూనే ఉంది. ఒకవేళ వైసీపీ దగ్గర పకడ్బందీ ఆధారాలు ఉంటే కోర్ట్ దాకా వెళ్లొచ్చు. అలాకాకుండా సొంత మీడియాలో రాసుకుంటే.. దానికి విశ్వసనీయత ఎలా ఉంటుంది. పాపం ఈ విషయం తెలియక వైసీపీ కింద మీద పడుతుంది. కానీ అసలు వాస్తవం ఏపీ ప్రజలకు తెలుసు.