Homeఆంధ్రప్రదేశ్‌Big TV:బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ గా అశోక్ ఎందుకు వైదొలిగాడు.. తెర వెనుక ఏం...

Big TV:బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ గా అశోక్ ఎందుకు వైదొలిగాడు.. తెర వెనుక ఏం జరిగింది..

Big TV: కొద్దిరోజులుగా బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాలపై సంచలన కథనాలను ప్రసారం చేస్తోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో సాక్షి టీవీ కూడా ఈ స్థాయిలో ప్రసారాలు సాగించలేదు. సాక్షిలో డీఎస్సీ మీద నెగిటివ్ కథనాలు ప్రసారమైనప్పటికీ దానిని జనం అంతగా పట్టించుకోలేదు. బిగ్ టీవీలో ప్రసారమైన కథనాలు ఒకరకంగా ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు […]

Big TV: కొద్దిరోజులుగా బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాలపై సంచలన కథనాలను ప్రసారం చేస్తోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో సాక్షి టీవీ కూడా ఈ స్థాయిలో ప్రసారాలు సాగించలేదు. సాక్షిలో డీఎస్సీ మీద నెగిటివ్ కథనాలు ప్రసారమైనప్పటికీ దానిని జనం అంతగా పట్టించుకోలేదు.

బిగ్ టీవీలో ప్రసారమైన కథనాలు ఒకరకంగా ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఏపీ అధికారులు కూడా ముందుకు వచ్చి డిఎస్సీ ప్రక్రియలో జరిగిన విధానాన్ని వివరించారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. భార్యాభర్తలకు ఉద్యోగాలు వచ్చాయని.. బిగ్ టీవీలో ఒక కథనం ప్రసారమైతే.. దానిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. పూర్తి ఆధారాలను బయటపెట్టి.. ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చింది.

బిగ్ టీవీ కథనాలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో.. అందులో పని చేస్తున్న చీఫ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా వెనుక ఎటువంటి ఒత్తిడి లేదని అశోక్ చెబుతున్నప్పటికీ.. ఇటీవల బిగ్ టీవీ ప్రసారం చేసిన డిఎస్సి కథనాల వల్ల ఆయన మనసు నొచ్చుకొని ఉంటుందని.. యాజమాన్యానికి వేరే ఉద్దేశం ఉండటంవల్ల.. తాను ఆ పని చేయలేక బయటకు వచ్చినట్టు జర్నలిస్టు వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అశోక్ వేములపల్లి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గానే ఉన్నారు. పాత్రికేయుడిగా ఈటీవీ నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. ఈరోజు వరకు కూడా ఆయనకు సొంత ఇల్లు లేదంటే అతని నిజాయితీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా వేతనం వచ్చే ఉద్యోగం ఉన్నప్పటికీ.. దాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నారు అంటే బిగ్ టీవీలో ఎటువంటి కథనాలు ప్రసారం చేశారో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు అంటున్నారు.

“బిగ్ టీవీ వైసిపికి అనుకూలంగా కథనాలను ప్రసారం చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని బిగ్ టీవీలో కథనం రాలేదు. కానీ నిరుద్యోగుల ఆశలను నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తే బిగ్ టివి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నది. ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూసేందుకు.. ఉద్యోగాలు సాధించిన వారి జీవితాల్లో మట్టి పోస్తోంది. చివరికి జర్నలిస్టులు ఒక వీధి రౌడీలుగా మారిపోయి ఉద్యోగాలు సాధించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు కేవలం ఏపీ రాష్ట్రంలోనే చూస్తున్నామని” టిడిపి నేతలు అంటున్నారు.. బిగ్ టీవీలో వేములపల్లి అశోక్ రాజీనామా చేయడం ఒక సంచలనంగా మారింది. దీని వెనక ఛానల్ అసలు ఉద్దేశం బయటపడిందని టిడిపి నేతలు అంటున్నారు. అయితే ఈ పరిణామాలు బిగ్ టీవీలో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper