Homeఆంధ్రప్రదేశ్‌AP Congress party: మాణిక్యం ఠాగూర్ అవుట్.. పిసి మోహన్ ఇన్.. ఏపీ "చేతి" రాత...

AP Congress party: మాణిక్యం ఠాగూర్ అవుట్.. పిసి మోహన్ ఇన్.. ఏపీ “చేతి” రాత మారుతుందా..

AP Congress party:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన దెబ్బతిన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పదవులను ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు అనుభవించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత వారు పార్టీకి దూరమయ్యారు. కొందరు వైసీపీలో చేరితే.. మరికొందరు టిడిపిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధినాయకురాలుగా మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుమార్తె […]

AP Congress party:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన దెబ్బతిన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పదవులను ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు అనుభవించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత వారు పార్టీకి దూరమయ్యారు. కొందరు వైసీపీలో చేరితే.. మరికొందరు టిడిపిలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధినాయకురాలుగా మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కొనసాగుతున్నారు. షర్మిల నాయకత్వంలో కనీసం 2024 లో ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి చెప్పుకునే స్థాయిలో స్థానాలు వస్తాయని నమ్మకం లేదు. షర్మిల కూడా ఏదో పార్ట్ టైం పొలిటిషన్ లాగానే ఉన్నారు. మధ్యలో ఆమెకు ఆరోగ్యం బాగోలేదు. కొద్దిరోజులు ఆస్తుల విషయంలో అన్నతో గొడవ.. వీటితోనే ఆమెకు సరిపోతోంది.. కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో అధికారంలో లేదు. చాలావరకు రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. అధికారం ఉన్నచోట చిటపటలు.. రకరకాల తలకాయ నొప్పులు..

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించే మాణిక్యం ఠాగూర్ ను పార్టీ అధినాయకత్వం తప్పించింది.. ఆయన స్థానంలో పిసి మోహన్ ను నియమించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఇలాంటి సమయంలో మాణిక్యం ఠాగూర్ ను పక్కన పెట్టినంతమాత్రాన పార్టీకి పూర్వకము వస్తుందా.. ఇన్చార్జిలను మార్చితే ప్రయోజనం ఏముంటుంది. మాణిక్యం ఠాగూర్ ఇన్చార్జిగా ఇన్ని రోజులు పని చేశారు. ఒకరోజు కూడా పార్టీ నాయకులతో మాట్లాడింది లేదు. శ్రేణులను కలుపుకు పోయింది లేదు.

షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సరైన స్థాయిలో బలం ఇవ్వలేదు. వైఎస్ఆర్సిపి ని ఇప్పటికి తమ ప్రధాన రాజకీయ శత్రువుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదు. జగన్ గ్రాఫ్ గత ఎన్నికల్లో పడిపోయినప్పుడు.. దానిని క్యాస్ట్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది. పైగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్సిపి విధానాలను ప్రశ్నించడం లేదు. జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మృదువైన వైఖరి ప్రదర్శిస్తోంది. అందువల్ల ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ సీపీకి బీ టీం లాగా భావిస్తున్నారు. ఓటర్లలో ఈ భావన ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలవడం కష్టం.

షర్మిల కొన్ని సందర్భాలలో గట్టిగా నిలబడుతున్నప్పటికీ.. కాంగ్రెస్ వాయిస్ ప్రజల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడంతో.. పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు లేకుండా పోయారు. సీనియర్ నేతలను.. కురవృద్ధులను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించినంత మాత్రాన క్షేత్రస్థాయిలో గొప్పగా ఫలితాలు రావు. దీనికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ శత్రువులను గుర్తించాలి. మిత్రువులేవరో తెలుసుకోవాలి. అది జరిగినాడే కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది. లేకుంటే ఇక అంతే సంగతులు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper