Homeఆంధ్రప్రదేశ్‌Anangi Hari: మాజీ మంత్రి రోజాకు షాక్.. పదవి నుంచి తొలగింపు

Anangi Hari: మాజీ మంత్రి రోజాకు షాక్.. పదవి నుంచి తొలగింపు

Anangi Hari: మాజీ మంత్రి ఆర్కే రోజాకు( RK Roja ) షాక్ తగిలింది. నగిరి నియోజకవర్గంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైయస్సార్సీపీ నేత ఆనంగి హరిని ( Anangi Hari) పదవి నుంచి తొలగిస్తూ ఏపీ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం తో పదవి దక్కించుకోవడమే ఇందుకు కారణం. దీనిపై విచారణ చేపట్టిన పురపాలక శాఖ.. నిజమేనని నిర్ధారణ కావడంతో పదవి […]

Anangi Hari: మాజీ మంత్రి ఆర్కే రోజాకు( RK Roja ) షాక్ తగిలింది. నగిరి నియోజకవర్గంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైయస్సార్సీపీ నేత ఆనంగి హరిని ( Anangi Hari) పదవి నుంచి తొలగిస్తూ ఏపీ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం తో పదవి దక్కించుకోవడమే ఇందుకు కారణం. దీనిపై విచారణ చేపట్టిన పురపాలక శాఖ.. నిజమేనని నిర్ధారణ కావడంతో పదవి నుంచి తొలగించింది. ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే.

* ఎస్సీ రిజర్వేషన్ తో ఎన్నిక..
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) చైర్మన్ గా హరి ఎన్నికయ్యారు. గతంలో హరి క్రైస్తవ మతంలోకి మారారు. ఆ సమయంలో ఆయన బీసీసీ కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు. 2014లో పుత్తూరు మున్సిపాలిటీలో కోఆప్షన్ నెంబర్ కూడా అయ్యారు. క్రిస్టియన్ మైనారిటీ కోటాలో అప్పట్లో పదవి దక్కించుకున్నారు. కానీ 2019 ఎన్నికల తరువాత వైసిపిలో చేరి.. 2020లో తాను ఎస్సీ గా పేర్కొని.. ఆ దృవీకరణతో 2021లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో.. ఎస్సీ కుల ధ్రువీకరణతో ఆయన ఎంపికయ్యారు. అంతకుముందే క్రిస్టియన్ మైనారిటీని చూపి కో ఆప్షన్ సభ్యుడయ్యారు. అప్పట్లో బీసీసీగా పేర్కొన్నారు. అయితే హరి కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కు తెలిసింది. అందుకే గత ఏడాది జూన్ 9న ఆయన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

* విచారణలో తేలడంతో..
మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. హరి కుల ధ్రువీకరణ( caste certificate) పై విచారణ చేపట్టారు. చివరకు హరి అక్రమంగా కుల ధ్రువీకరణ పత్రం పొందారని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హరిని మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. అయితే రాజకీయ కక్షతోనే ఇదంతా చేశారని హరి చెబుతున్నారు. కానీ ఆధారాలు సమర్పించలేకపోయారు. మున్సిపల్ చైర్మన్ పదవిని కాపాడుకోలేకపోయారు. ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రోజాకు షాక్ ఇచ్చే పరిణామమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper