Homeఆంధ్రప్రదేశ్‌RK Roja: వైసిపికో దండం.. తమిళ పాలిటిక్స్ లోకి రోజా

RK Roja: వైసిపికో దండం.. తమిళ పాలిటిక్స్ లోకి రోజా

RK Roja: తమిళనాడు ( Tamil Nadu )ఎన్నికలు పతాక స్థాయికి చేరాయి. ప్రచార పర్వం ముగిసింది. తెలుగు నేతల తాకిడి ఎక్కువగా ఉంది. టిడిపి అధినేత చంద్రబాబు తో పాటు ఆ పార్టీ నేతలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీమంత్రి రోజా ఒక్కరే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె డిఎంకె తరఫున ప్రచారం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పంపిందా? లేకుంటే రోజా సొంతంగా […]

RK Roja: తమిళనాడు ( Tamil Nadu )ఎన్నికలు పతాక స్థాయికి చేరాయి. ప్రచార పర్వం ముగిసింది. తెలుగు నేతల తాకిడి ఎక్కువగా ఉంది. టిడిపి అధినేత చంద్రబాబు తో పాటు ఆ పార్టీ నేతలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీమంత్రి రోజా ఒక్కరే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె డిఎంకె తరఫున ప్రచారం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పంపిందా? లేకుంటే రోజా సొంతంగా వెళ్లారో తెలియడం లేదు. కానీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎందుకంటే అక్కడ ఎన్నికల్లో డిఎంకె వ్యతిరేక కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. అయితే రోజా పక్కా రాజకీయ వ్యూహంతోనే తమిళనాడు రాజకీయాల వైపు వెళ్లినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ బలంగా నడుస్తోంది. ఒకవేళ డీఎంకే గెలిస్తే రోజాకు కీలక పదవి ఇచ్చేందుకు స్టాలిన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తెలుగు రాజకీయాలకు గుడ్ బై చెప్పి రోజా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచనతోనే ఈ ప్రచారానికి దిగినట్లు తెలుస్తోంది.

* తగ్గిన అవకాశాలు..
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరలో కూడా రోజాకు( RK Roja) అవకాశాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఉండడం కంటే తమిళనాడు వైపు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు రోజా. ప్రస్తుతం ఏపీలో ఆమెకు వ్యతిరేకత ఎక్కువైంది. పైగా వివాదాస్పద ముద్రతో తన కెరీర్ పరంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. గతంలో బుల్లితెర హోస్టుగా వ్యవహరించిన ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు టీవీ ఛానల్ యాజమాన్యాలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఇంకోవైపు రాజకీయంగా కూడా పెద్దగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గ నగిరిలో ఏమంత పరిస్థితి బాగాలేదు. అక్కడ అభ్యర్థిని మార్చే పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతామన్న కుదిరే పని కాదు. ఈ పరిస్థితుల్లో గౌరవంగా తెలుగు రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది.

* డీఎంకే అధికార ప్రతినిధిగా..
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే కూటమి( DMK Alliance ) మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే రోజా తనంతట తానుగా డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారట. ముఖ్యమంత్రి స్టాలిన్ తో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయనను సోదరుడిగా పరిగణిస్తారు రోజా. అందుకే డీఎంకే గెలిస్తే కీలక నామినేటెడ్ పదవి కట్టబెట్టే ఆలోచనతో స్టాలిన్ ఉన్నారు. డీఎంకే గెలిచిన మరుక్షణం రోజా తమిళనాడు పై ఫుల్ ఫోకస్ పెడతారు. ఇప్పటికే అక్కడ ఆమెకు సినీ గ్లామర్ ఉంది. అందుకే అక్కడ బుల్లితెరపై కూడా అవకాశాలు వస్తాయి. డీఎంకే అధికార ప్రతినిధి హోదాతో పాటు కీలక నామినేటెడ్ పదవి ఆమెకు దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఏదైనా తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చాక రోజా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper