Homeక్రైమ్‌YouTuber Vaishnavi: 12 మంది అన్నలకు ఒక్కతే చెల్లెలు వైష్ణవి.. సోషల్ మీడియాలో ఇదే నిజమైన...

YouTuber Vaishnavi: 12 మంది అన్నలకు ఒక్కతే చెల్లెలు వైష్ణవి.. సోషల్ మీడియాలో ఇదే నిజమైన నివాళి..

YouTuber Vaishnavi: ఆ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు.. దాదాపు 12 మంది సోదరులు. వీరిలో కొంతమంది దగ్గర బంధువులు కూడా ఉన్నారు. వీరందరికీ ఆమె ఒక్కతే సోదరి. ఆమెను అత్యంత అపురూపంగా చూసుకునేవారు. కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునేవారు. కానీ ఆమె సోదరుల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుంది. అది కాస్త ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన చిత్తరి హరిబాబు […]

YouTuber Vaishnavi: ఆ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు.. దాదాపు 12 మంది సోదరులు. వీరిలో కొంతమంది దగ్గర బంధువులు కూడా ఉన్నారు. వీరందరికీ ఆమె ఒక్కతే సోదరి. ఆమెను అత్యంత అపురూపంగా చూసుకునేవారు. కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునేవారు. కానీ ఆమె సోదరుల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుంది. అది కాస్త ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన చిత్తరి హరిబాబు (26), యూట్యూబర్ వైష్ణవి (20) ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. గత ఏడాది మే నెలలో వివాహం కూడా చేసుకున్నారు. వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులకు అంతగా ఇష్టం లేదు. దీనికి తోడు వైష్ణవి గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో హరిబాబు తనలో ఉన్న అసలు రూపాన్ని వైష్ణవికి చూపించాడు. కట్నం తీసుకురావాలని ఆమెను వేధించేవాడు. ఈ నేపథ్యంలో హరిబాబు ఈ సంవత్సరం మార్చి 17న వైష్ణవిని అంతం చేశాడు.

బహిరంగంగానే హెచ్చరించారు

నాడు ఆ ఘటన జరిగిన తర్వాత వైష్ణవి సోదరులు 12 మంది (పెదనాన్న, బాబాయిల కుమారులు) హరిబాబును అంతం చేస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. ఇక నాడు ఆ కేసులో అరెస్ట్ అయిన హరిబాబు ఇటీవల నెల క్రితం బెయిల్ మీద విడుదలయ్యాడు. ప్రాణ భయంతో తన తల్లి లక్ష్మితో కలిసి జగిత్యాల నుంచి నిజామాబాద్ కు వచ్చాడు. నిజామాబాదులోని ఆర్ఆర్ చౌరస్తా ప్రాంతంలో మొక్కజొన్న కంకులు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సరిగ్గా సాయంత్రం ఐదు గంటల సమయంలో చౌరస్తాలోని పానీపూరి బండి వద్ద హరిబాబు ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు నింపుకుంటున్నాడు. అదే సమయంలో రోడ్డుకు మరోవైపు ఒక కారు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. కొబ్బరి బోండాలు కొట్టే పదునైన ఆయుధంతో హరిబాబు తల, మెడ మీద దాడి చేశాడు.. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రక్తపు మడుగులో హరిబాబు పడిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు.

ఆత్మకు శాంతి కలిగింది

మార్చి 17న వైష్ణవి చనిపోయింది.. హరిబాబు సెప్టెంబర్ 17న అంతమయ్యాడు. గతంలో వైష్ణవి సోదరులు హరిబాబును ఆంతం చేస్తామని హెచ్చరించారు. ఈ కారణాలను లోతుగా విశ్లేషించిన పోలీసులు వైష్ణవి సోదరుల పాత్ర పై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. హరిబాబును తానే అంతం చేశానని.. స్వీయ వీడియోలో పేర్కొన్నాడు.. అతను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ కు గురువారం రాత్రి వచ్చి లొంగిపోయాడు. కోరుట్ల పోలీసులు అతడిని నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈఘటన జరిగిన తర్వాత ఓ ఫొటో సోషల్ మీడియాలోొ చక్కర్లు కొడుతోంది. 12 మంది సోదరులం ఉన్నా నిన్ను కాపాడుకోలేకపోయాం.. ఇప్పటికైనా నీ ఆత్మకు శాంతి కలిగిందనుకుంటున్నామని ఆ పోస్టులో ఉంది.

ఇలాంటి పరిణామలే జరుగుతాయి

వైష్ణవి యూట్యూబ్లో ఫేమస్. ఆ కుటుంబాలలో ఒక్కతే ఆడపిల్ల. అటువంటి అమ్మాయి ప్రేమను దక్కించుకున్న హరిబాబు.. ఆ ప్రేమను మరింత సుస్థిరం చేసుకోవాల్సి ఉండేది. ఆ కుటుంబాలలో అల్లుడిగా మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉండేది. అలా కాకుండా మొదట్లో ప్రేమ చూపించి.. ఆ తర్వాత డబ్బు ఆశతో అమ్మాయిని కొట్టడం.. చివరికి రెండు నెలల గర్భిణీ అని తెలిసినప్పటికీ కూడా దారుణానికి పాల్పడడం సభ్య సమాజాన్ని కలచివేసింది. నాడు వైష్ణవి చనిపోయిన తర్వాత కొద్ది రోజులపాటు ప్రధాన మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలే వచ్చాయి అంటే.. అక్కడ జరిగిన ఘటన తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ చేసిన పాపానికి హరిబాబు శిక్ష అనుభవించాడు. కాకపోతే మన సమాజంలో హింసకు హింస సమాధానం కాదు. ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు.. చిన్నచిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలి. అవసరమైతే వాటిని పరిష్కరించుకోవాలి. అలా కాకుండా హరిబాబు లాగా చేస్తే చివరికి ఇలాంటి పరిణామాలే జరుగుతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper