HomeతెలంగాణTelangana Politics : క్రీడాకారిణి తో ఏకసెక్కాలు.. మంత్రి ముందే ఇచ్చి పడేసింది..

Telangana Politics : క్రీడాకారిణి తో ఏకసెక్కాలు.. మంత్రి ముందే ఇచ్చి పడేసింది..

Telangana Politics : భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఓ మంత్రి మీద ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి తక్కల్లపల్లి ప్రతిభ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను బయటపెట్టారు. నాడు తనని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మెడల్స్ తీసుకు వస్తే.. ప్రోత్సహించాల్సింది పోయి.. అందంగా ఉన్నావు.. కలుస్తావా అంటూ ఇబ్బందికరంగా వ్యాఖ్యానించారని ప్రతిభ ఆరోపించింది. ప్రతిభ మాట్లాడిన […]

Telangana Politics : భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఓ మంత్రి మీద ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి తక్కల్లపల్లి ప్రతిభ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను బయటపెట్టారు. నాడు తనని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మెడల్స్ తీసుకు వస్తే.. ప్రోత్సహించాల్సింది పోయి.. అందంగా ఉన్నావు.. కలుస్తావా అంటూ ఇబ్బందికరంగా వ్యాఖ్యానించారని ప్రతిభ ఆరోపించింది.

ప్రతిభ మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగించాయి. తనకు అతడి వ్యవహార శైలి నచ్చకపోవడంతో అప్పటికే నాడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానని చెప్పింది. నాతో అనవసరమైన వ్యవహారాలకు పాల్పడితే.. రెండు నిమిషాలలో నీ బాడీలో ఏ పార్టీ కూడా పనిచేయకుండా చేస్తా అంటూ.. మంత్రి ముందే హెచ్చరించింది. ఈ వీడియో బయటకి విడుదల కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఇది చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ నాయకులు రంగంలోకి వచ్చారు.. ఆ క్రీడాకారిణి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను విపరీతంగా సర్కులేట్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా రాజకీయ వర్గాలలో ఈ వీడియో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది. గత ప్రభుత్వంలో ప్లేయర్లకు ముఖ్యంగా మహిళలకు ఇటువంటి అనుభవం ఎదురైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.. గులాబీ పార్టీ సోషల్ మీడియా ఇటువంటి వాటిని ఎలా సమర్థించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖ అంశానికి విపరీతమైన ప్రయారిటీ ఇచ్చిన మీడియా.. ఇటువంటి విషయాలను ఎందుకు పట్టించుకోదని కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

సదరు క్రీడాకారిణి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్న నేపథ్యంలో.. ఇంతవరకు నాటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే కొన్ని వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.. ఆ ప్రకారం చేసుకుంటే నాడు జరిగిన ఘటనలో సదరు మంత్రి త్వరగానే స్పందించారని తెలుస్తోంది. నాడు మంత్రి పేషిలో పనిచేసిన ఒక వ్యక్తి ఇలా వ్యవహరించారని సమాచారం. ఈ క్రమంలో నాడు మంత్రి ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్టు ప్రచారంలో ఉంది. అప్పట్లో మంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే నాడు సదరు క్రీడాకారిణి మాట్లాడిన మాటలు వేరే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో విధంగా ఉన్నాయి. దీంతో ఆమె మీద సోషల్ మీడియాలో గులాబీ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. అప్పుడు ఒక విధంగా మాట్లాడి.. ఇప్పుడు మరో విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ఆమెని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సదరు అథ్లెట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper