Viswanath And Sons: ‘కరుప్పు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూర్య నుండి విడుదలైన ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఓపెనింగ్స్ దగ్గరి నుండే భారీ గా వచ్చాయి కానీ, తమిళనాడు లో మాత్రం ఆ రేంజ్ వసూళ్లు రాకపోవడం తో , కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమాకు వచ్చిన లాంగ్ రన్ చూస్తే మతి పోవాల్సిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ సునామీ నడుస్తున్నప్పటికీ కూడా, ‘విశ్వనాధ్ & సన్స్’ వసూళ్లు తగ్గలేదు. వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ, వీకెండ్స్ లో భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ వచ్చింది ఈ చిత్రం.
ఇప్పుడు కమర్షియల్ గా పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, సూర్య కెరీర్ లో మరో క్లీన్ సూపర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?, ఎంత లాభాలను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా మనం చూడబోతున్నాము. 17 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 2 కోట్ల 20 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 58 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 54 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదేవిధంగా కేరళ నుండి 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఏకంగా 63 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 97 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఒకే ఏడాది లో, కేవలం మూడు నెలల గ్యాప్ తో బ్యాక్ టు బ్యాక్ 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఏకైక హీరో గా సూర్య సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి లాభాలు 4 కోట్ల రూపాయిల వరకు వచ్చాయట. రాబోయే రోజుల్లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.