Wedding Invitations : భారతదేశ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే కొన్ని కార్యక్రమాలకు అతిథులను పిలవడం ఆనవాయితీ. వీటిలో వివాహ కార్యక్రమానికి తమకు తెలిసి ఉన్న బంధువులు, మిత్రులు, తోటి ఉద్యోగులు, చుట్టుపక్కల వారిని పిలుస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన వారిని కొందరు సాదరంగా ఆహ్వానిస్తే.. మరికొందరు పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి అప్పుడు వారి పెళ్లికి ఎందుకు వెళ్ళామా? అన్న భావన కలిగిస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లేముందే ఒక నిర్ణయానికి రావాలని కొందరు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఎవరి పెళ్లికి వెళ్లాలి? ఎవరి శుభకార్యానికి పిలిచినా వెళ్లకుండా ఉండాలి? అనే దానిపై ఆసక్తిగా చర్చ సాగుతుంది. దీని గురించి వివరాల్లోకి వెళితే..
తనతోపాటు పనిచేసే ఒక వ్యక్తి లేదా తనకంటే అత్యధికంగా డబ్బు ఉన్న వ్యక్తి.. తన శుభకార్యానికి పిలిచాడని అనుకుందాం.. అప్పుడు అతడు ఎక్కువగా డబ్బున్న వ్యక్తులని ఆదరిస్తూ ఉంటాడు. వారి ముందు తమ గొప్పతనాన్ని చాటుకునేలా హుందాగా వ్యవహరిస్తాడు. అయితే తమకంటే కాస్త డబ్బు తక్కువగా ఉండి.. సాదాసీదాగా ఉన్న వారి గురించి పెద్దగా పట్టించుకోరు. కనీసం భోజనం చేశారా? అన్న విషయం కూడా కొందరు అడగరు. ఎన్నో ప్రయాసలు పడి.. ఎంతో ఆదరిస్తారని ఆశపడి.. వచ్చిన వారికి ఈ పరిస్థితిని చూసి నిరాశ కలుగుతుంది. వాస్తవానికి ఇలాంటి వారు తమ శుభ కార్యక్రమానికి రావాలని ప్రేమతో పిలవరు.. కేవలం మొబైల్ లో లేదా గ్రూపులో కార్డ్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి వారి కార్యక్రమానికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిదని సూచిస్తున్నారు.
అయితే ఒక సంస్థ లేదా కంపెనీలో పనిచేసే చిరు ఉద్యోగి పెళ్లికి.. పిలిస్తే తప్పకుండా వెళ్లాలని అంటున్నారు. ఎందుకంటే అలాంటివారు తమ సంస్థ యజమాని వస్తున్నాడని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేస్తూ ప్రత్యేక మర్యాదలు చేస్తారు. ఆహార విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు.
దీనిని బట్టి చూస్తే మనం కోరే వాళ్ళ కన్నా.. మనల్ని ప్రేమించే వాళ్ళ ఇంటికి అతిథులుగా వెళ్లడం ఎంతో ఉత్తమం అని కొందరు పెద్దలు, మానసిక నిపుణులు తెలుపుతున్నారు. మనం కావాలని అనుకునే వారి ఇంటికి ఎప్పుడైనా వెళ్లవచ్చు అని.. అక్కడ వారి మర్యాదకు ఎలాంటి లోటు ఉండదని.. అంతేకాకుండా అలా వెళ్ళిన వారితో అక్కడున్న వారు ఎంతో సంతోషిస్తారని చెబుతున్నారు.