Homeలైఫ్ స్టైల్emotional loneliness: మనకు ఎక్కువగా కష్టంగా అనిపించేది ఒంటరితనం కాదు.. అందరూ ఉన్నా ఇలాంటప్పుడే..

emotional loneliness: మనకు ఎక్కువగా కష్టంగా అనిపించేది ఒంటరితనం కాదు.. అందరూ ఉన్నా ఇలాంటప్పుడే..

emotional loneliness: మనకు ఎక్కువగా కష్టంగా అనిపించేది ఒంటరితనం కాదు.. అందరూ ఉన్నా ఇలాంటప్పుడే.. బంధాలు, బంధుత్వాలు మనిషి జీవితాన్ని ఎంతో హాయిగా ఉంచుతాయి. పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు జీవితంలో ఎంతోమందిని కలుస్తుంటాం. వీరిలో మంచివారు ఉంటారు.. చెడ్డవారు ఉంటారు.. మన బంధువులు, ఆత్మీయులు అందరూ మంచివారని అనుకోలేం.. స్నేహితులు, తోటి పనివారు చెడ్డవారిని అనుకోలేం.. ఒక్కోసారి ఎవరూ లేకపోయినా ఒంటరిగా ఉన్నా కూడా అనిపించని బాధ కంటే.. అందరూ ఉండి కూడా ఇలాంటి సమయంలో ఎక్కువగా […]

emotional loneliness: మనకు ఎక్కువగా కష్టంగా అనిపించేది ఒంటరితనం కాదు.. అందరూ ఉన్నా ఇలాంటప్పుడే..

బంధాలు, బంధుత్వాలు మనిషి జీవితాన్ని ఎంతో హాయిగా ఉంచుతాయి. పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు జీవితంలో ఎంతోమందిని కలుస్తుంటాం. వీరిలో మంచివారు ఉంటారు.. చెడ్డవారు ఉంటారు.. మన బంధువులు, ఆత్మీయులు అందరూ మంచివారని అనుకోలేం.. స్నేహితులు, తోటి పనివారు చెడ్డవారిని అనుకోలేం.. ఒక్కోసారి ఎవరూ లేకపోయినా ఒంటరిగా ఉన్నా కూడా అనిపించని బాధ కంటే.. అందరూ ఉండి కూడా ఇలాంటి సమయంలో ఎక్కువగా బాధ కలుగుతుంది. అలాంటి సమయం ఏంటిది అంటే?

చాలామంది తమ చుట్టూ ఎంతోమంది ఉన్నారు.. తమకు ఎప్పుడు అంటే అప్పుడు సహాయం చేస్తారు.. అని భావిస్తారు. కానీ సంతోష సమయంలో ఉన్నవారికంటే ఆపదలో తోడుగా ఉన్నవారే నిజమైన మిత్రులు.. బంధువులు. ఒక వ్యక్తికి తాను సంతోషంగా ఉన్నప్పుడు తన చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ అప్పుడు ఎదుటివారి విలువ, గుణాలు తెలియరావు. తనకు కష్టం వచ్చినప్పుడు ఎలాంటి వారు సహాయం చేశారు? ఎవరు తనకు ఆప్త మిత్రులుగా ఉన్నారు? అనే విషయం తెలుస్తుంది. కనీసం ఈ సమయంలోనైనా మంచివారు ఎవరో? చెడ్డవారు ఎవరో? తెలుసుకొని వారితో.. వారికి అనుగుణంగా ఉండడమే మంచిది. ఇలాంటి అప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే?

మీకు దగ్గరి బంధువులైనా.. దూరపు స్నేహితులైనా.. మీకోసం 20% కష్టపడడం లేదా మీ కోసం పనులు చేయడం వంటి వారు ఉంటే.. వారికోసం 100% కష్టపడాల్సిన అవసరం లేదు. వారు ఎంత అయితే సేవ చేస్తున్నారో.. మనతో ఎలాగైతే ఉంటున్నారో.. వారితో కూడా అలాగే ఉండడం మంచిది. ఎందుకంటే మీరు 100% వారికోసం పనిచేసిన కూడా.. వారు ఎప్పటికీ 20% మాత్రమే మీ మీద ప్రేమ లేదా దయ మాత్రమే ఉంటుంది.

చాలామంది లోపల ఎన్ని బాధలు ఉన్నా.. పైకి సంతోషంగా కనిపిస్తారు. కానీ ఇది ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే మీలో ఉన్న బాధను దాచిపెడితే ఎదుటివారికి మీరు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారని అనుకుంటారు. ఫలితంగా మీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇలాంటి అప్పుడు మీకు ఉన్న బాధను బయటపెడితే ఎవరైనా సహాయం చేస్తున్నారా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఇలాంటి సమయంలో సహాయం చేసే వారే నిజమైన మిత్రులుగా భావించాలి.

ఇతరులకు సహాయం చేయడం మంచిదే. కానీ వ్యక్తిగతంగా నష్టం చేకూర్చి ఇతరులకు మేలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్న ఎనర్జీని మిగతా వారి కోసం ఖర్చు చేసి మీకోసం ఏమీ లేకుండా ఒంటరిగా మిగలడం ద్వారా నష్టమే జరుగుతుంది. అయితే మీరు ఇలా సహాయం చేసి మీకు తిరిగి చేసేవారు ఎంతమంది ఉన్నారు? అనేది తెలుసుకోవాలి. అలాంటి సమయంలోనే ఆదుకున్న వారు నిజమైన మిత్రులుగా భావించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper