Homeఅంతర్జాతీయంPakistan Economic Crisis: పాకిస్తాన్‌ దివాళా.. అక్కడ బతకడం ఎంత దుర్భరంగా ఉందంటే?

Pakistan Economic Crisis: పాకిస్తాన్‌ దివాళా.. అక్కడ బతకడం ఎంత దుర్భరంగా ఉందంటే?

Pakistan Economic Crisis: మన దేశంలో నిత్యావసర ధరలు ఇటీవలికాలంలో భారీగా పెరుగుతున్నాయి. పంచదార, ఉల్లి, వంటనూనె ధరలు వంటింట్లో మంట పెట్టాయి. బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడి బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న భారత్‌లోనే పరిస్థితి ఇలా ఉంది. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్‌ అయితే పూర్తిగా దివాళీ తీస్తోంది. నిత్యావసరాలు చుక్కలను తాకుతున్నాయి. ప్రధాన నగరాల్లోని సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను క్షీణింపజేస్తున్నాయి. కూరగాయల నుంచి ఇంధనం, వంటగ్యాస్‌ […]

Pakistan Economic Crisis: మన దేశంలో నిత్యావసర ధరలు ఇటీవలికాలంలో భారీగా పెరుగుతున్నాయి. పంచదార, ఉల్లి, వంటనూనె ధరలు వంటింట్లో మంట పెట్టాయి. బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడి బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న భారత్‌లోనే పరిస్థితి ఇలా ఉంది. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్‌ అయితే పూర్తిగా దివాళీ తీస్తోంది. నిత్యావసరాలు చుక్కలను తాకుతున్నాయి. ప్రధాన నగరాల్లోని సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను క్షీణింపజేస్తున్నాయి. కూరగాయల నుంచి ఇంధనం, వంటగ్యాస్‌ వరకు ప్రతీ నిత్యావసర వస్తువు ధరలు పెరగడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారుతోంది.

నిత్యావసరాల భారం..
మార్కెట్‌లో కనిపించే ధరలు సామాన్య కుటుంబాల బడ్జెట్‌ను మించిపోయాయి. ఆహార పదార్థాలు, ఇంటి అద్దెలు, విద్యుత్‌ ఛార్జీలు కలిసి రోజువారీ కూలీలు, తక్కువ వేతనాలపై జీవించే వారికి రెండు పూటల భోజనం కూడా కష్టసాధ్యంగా మారింది. పేదవర్గాలు ఆకలిని సహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జీవన వ్యయం నిరంతరం పెరుగుతోంది. ఫలితంగా కుటుంబాల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటోంది.

ఉపాధి, పెన్షన్లపై ప్రభావం
ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులు, స్వయం ఉపాధి చేసుకునేవారు ఈ పరిస్థితుల్లో మరింత ఇబ్బంది పడుతున్నారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు మన్సూర్‌ అలీ ప్రభుత్వం అందించే పరిమిత పెన్షన్‌తో కుటుంబ పోషణ, పిల్లల విద్య, వైద్య ఖర్చులు భరించడం అసాధ్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంధన ధరలు పెరగడంతో రోజంతా శ్రమించినా చివరకు ఇంటికి తీసుకెళ్లే మొత్తం సరిపోవడం లేదని ఆటో డ్రైవర్‌ ఉస్మాన్‌ అలీ తెలిపాడు. ఇలాంటి స్వయం ఉపాధి రంగాల్లో లాభం కనిపించకపోవడం మరిన్ని కుటుంబాలను ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టేస్తోంది.

కాగితాలకే పరిమితమైన అధికారిక ధరలు..
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాగితాలకే పరిమితమై, వాస్తవ విక్రయాల్లో భిన్నంగా ఉంటున్నాయని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్లు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముడుపోతున్నా సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ధరలు తగ్గినా, స్థానిక మార్కెట్‌లో కూరగాయలు, ఆహార ధాన్యాలపై ఆ ప్రభావం కనిపించడం లేదని పాకిస్తానీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల దోపిడీని నియంత్రించే వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు.

ధరల పెరుగుదల తక్కువ ఆదాయ వర్గాల జీవన భద్రతను, ఉపాధి సామర్థ్యాన్ని, సామాజిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తోంది. లాహోర్‌లోని ఈ అనుభవాలు దేశవ్యాప్త ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తూ, సమర్థవంతమైన ధరల నియంత్రణ, పెన్షన్‌ మెరుగుదల, స్వయం ఉపాధి రంగాలకు మద్దతు అవసరమని సూచిస్తున్నాయి. ప్రజల ఆవేదనలు పట్టించుకోకపోతే లక్షలాది కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper