భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని అంటారు. ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎక్కువగా పాటిస్తారు. పురాతన కాలంలో పెద్దలు ఏర్పాటుచేసిన కొన్ని పద్ధతులు, నియమాల ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే నేటి కాలంలో కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటిని సరైన విధంగా పాటించడం వల్ల జీవితం సక్రమంగా ఉంటుందని కొందరు భావిస్తారు. వీటిలో గ్రహాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. గ్రహాలన్నిటిలో కుజ గ్రహం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కుజ గ్రహం మంగళవారం ఆధిపత్యంగా ఉంటుంది. అందువల్ల మంగళవారం, శుక్రవారం ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు అని అంటారు. మరి ఈ రెండు రోజుల్లో డబ్బు ఇస్తే సమస్యలు వస్తాయా?
మంగళవారం కుజుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. కుజుడు అంటే భూమికి అధిపతి. మనం నేలపై ఉండడంవల్ల మనుషులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అందువల్ల మంగళవారం రోజున కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అలాగే ఈరోజు ఏ శుభకార్యాలను నిర్వహించడానికి సాహసించరు. శుక్రవారం కూడా ఇతరులకు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడరు. అప్పు తీసుకున్న వారు కూడా తిరిగి చెల్లించడానికి ఈరోజు ఎంచుకోరు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రతీక అని భావించి డబ్బులు ఇస్తే లక్ష్మీ వెళ్ళిపోతుందని అనుకుంటారు.
అయితే ఆపదలో ఉన్న వారికి డబ్బు ఇవ్వకపోతే మరింత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజుల్లో ముఖ్యమైన పనులు నిర్వహించద్దని పేర్కొంటారు. ఇలాంటి సమయంలో కొందరు చెబుతున్న ప్రకారం ఏంటంటే.. l అత్యవసరం కాకపోతే డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండొచ్చని.. కానీ అత్యవసరమైతే ఆర్థిక వ్యవహారాలు జరుపుకోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే అత్యవసర కార్యక్రమానికి దైవం కూడా అనుగ్రహం ఉంటుందని.. ఇలాంటి విషయాల్లో పట్టింపులు ఉండకూడదని పేర్కొంటున్నారు.
అయితే మంగళవారం కుజుడు అధిపతి ఉన్నా కూడా డబ్బు వ్యవహారాలు జరుపుకోవచ్చని.. శుక్రవారం మాత్రం అత్యవసరం లేకుంటే పాటించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి డబ్బు వెళ్లి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని మినహాయింపులు ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలని అనుకుంటే మంగళవారం కాకుండా మరో రోజు ఏర్పాటు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.