Sleep Duration : మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు సరైన నిద్ర పోవడం వల్లనే యాక్టివ్ గా ఉండగలుగుతారు. అయితే చాలామంది నేటి కాలంలో క్రమ పద్ధతిలో నిద్రపోవడం లేదు. కొందరు ఆలస్యంగా నిద్రిస్తూ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుంటే.. మరికొందరు తక్కువ నిద్రపోతున్నారు. ఇలాంటి వారిలో ఆరోగ్యం ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని గంటలు మెలకువతో ఉండాలి?
వయసును బట్టి ఎంతసేపు నిద్రించాలి? అనేది నిర్ణయించబడుతుంది. చిన్నపిల్లలు 10 గంటల వరకు నిద్రపోవచ్చు.. పెద్దవారు కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఒకరోజు నిద్ర ఉండి.. మరో రోజు నిద్ర లేకపోయినా.. వారంలో కనీసం నిర్ణీత గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రతిరోజు కనీసం ఆరు గంటలు అయినా కూడా నిద్రించాలని అంటున్నారు. ఆరు గంటలకంటే తక్కువ నిద్రిస్తే మెదడుకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి.. రోగ నిరోధక శక్తి తగ్గి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో నిద్ర కరువైన మరుసటి రోజు అలసట లేదా చికాకు ఉండే అవకాశాలున్నాయి.
ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉంటే ఒబేసిటీ సమస్యలు కూడా పెరుగుతాయని అంటున్నారు. దీంతో ఎక్కువగా తినాలని కోరిక కలగడం.. అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వంటి అలవాట్లు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల బరువు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే నిద్ర తక్కువ పోవడం ఎంత సమస్యలు ఉంటాయో.. ఎక్కువ నిద్రించినా కూడా సమస్యలు వస్తుంటాయి. వయోజనుల్లో ప్రతిరోజు 9 గంటల కంటే ఎక్కువగా నిద్ర పోతే ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు నిద్రించి లేచిన వారిలో నీరసం ఉంటుంది. కొన్ని పరిశోధనలలో ఎక్కువసేపు నిద్రపోయిన వారిలో కూడా ఊబకాయం వంటి సమస్యలు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
అందువల్ల ప్రతిరోజు కనీస గంటలపాటు నిద్రించాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగని ఎక్కువసేపు నిద్రించకుండా క్రమ పద్ధతిలో స్లీపింగ్ చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే నిద్రలేమి కారణంగా శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు వచ్చి చర్మం కూడా ముడతలు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది అని చెబుతున్నారు.