Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 27.8.2026 : ఈ రాశుల వారి ఇంట్లో ఈరోజు సందడే...

Today horoscope in telugu 27.8.2026 : ఈ రాశుల వారి ఇంట్లో ఈరోజు సందడే సందడి.. ఆకస్మిక ధన లాభం..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. దీంతో ఉద్యోగులు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుంది. ఫలితంగా అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మాన్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడును పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అధిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఊహించని రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు భావోద్వేగాలు ఏర్పడతాయి. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటారు. దీంతో కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఏదైనా వ్రతంలో పాల్గొంటే కచ్చితంగా నియమాలు పాటించాలి నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబాల విషయంలో తీసుకునే నిర్ణయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఊహించని ధన లాభం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు మాటతీరును మెరుగుపరచుకోవాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి తీసుకురే ప్రయత్నం చేయాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వీరితో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రణాళిక ప్రకారంగా డబ్బులు ఖర్చు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న కోరికలు ఈరోజు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషాలు వెలివేరుస్తాయి. ఈరోజు అంతా ఉత్సాహంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు క్రమశిక్షణతో ఉండడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఊరికే డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కళా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీరికి తోటి వారి సహకారం ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper