Homeఆంధ్రప్రదేశ్‌YSRCP : వైసిపి బీసీ అజెండా.. అసలు విషయం అదేనట..

YSRCP : వైసిపి బీసీ అజెండా.. అసలు విషయం అదేనట..

YSRCP : ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా పూర్తయినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లు.. ఇతర వ్యవహారాలను కూడా కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల వాతావరణం ఏర్పడుతోంది. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సరే మెజారిటీ స్థానాలను సాధించాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఇటీవల వరుసగా విలేకరుల సమావేశం నిర్వహిస్తూ.. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం […]

YSRCP : ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా పూర్తయినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లు.. ఇతర వ్యవహారాలను కూడా కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల వాతావరణం ఏర్పడుతోంది.

స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సరే మెజారిటీ స్థానాలను సాధించాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఇటీవల వరుసగా విలేకరుల సమావేశం నిర్వహిస్తూ.. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఏకగ్రీవాలు కావాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు ఆయన స్వరం మారింది. ఏ ఎమ్మెల్యే కూడా ఏకగ్రీవాలకు ఒప్పు కోకూడదని.. పార్టీ కోసం పని చేసే కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే రావడంతో.. జగన్లో చాలావరకు ఆలోచన మొదలైంది. అందువల్లే ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారు. బలమైన కార్యకర్తలను మరింత బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. అందువల్లే ఈ స్థాయిలో వరుసగా నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా బీసీలకు సంబంధించి జగన్ కీలక ప్రకటన చేశారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అనే విధాలుగా మేలు జరిగిందని.. రిజర్వేషన్ల విషయంలో.. వైసిపి బీసీలకు అండగా నిలిచిందని జగన్ పేర్కొన్నారు. పైగా ఇప్పుడు బీసీలకు కొత్తగా రిజర్వేషన్లు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. జగన్ సరికొత్త పల్లవి అందుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

బీసీల మీద జగన్ విపరీతమైన ప్రేమను కనబరుస్తున్న నేపథ్యంలో.. టిడిపి నేతలు రంగంలోకి దిగారు. బీసీల మీద జగన్ ఈ స్థాయిలో ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు అనే విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద కేసులు నమోదు చేశారట. ఏకంగా 25 వేల ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారట. 300 మంది బలి అయ్యారట. నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల మీద జగన్ పగను ప్రదర్శించారట. బీసీలను చులకనగా చూశారట. ప్రతి ప్రాంతానికి సామంత రాజుల మాదిరిగా విజయసాయిరెడ్డి.. వై వి సుబ్బారెడ్డి.. మిధున్ రెడ్డి వ్యవహరించారట.. బీసీలను వాళ్ళ కాళ్ల దగ్గర జగన్ కూర్చోబెట్టారట.. ఒకరకంగా వాళ్లను ఊచ కోత కోశారట.. ఇవే మాటలను టిడిపి నాయకుడు చింతకాయల విజయ్ మాట్లాడారు. బీసీల మీద జగన్ కు ప్రేమ లేదని.. రాజకీయ అవసరాల కోసం వారి మీద ప్రేమను వ్యక్తం చేస్తున్నారని చింతకాయల విజయ్ ఆరోపించారు. ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో బీసీల మీద జగన్ ప్రేమ చూపించడం వెనక అసలు వాస్తవాలను చింతకాయల విజయ్ ఆధారాలతో సహా బయట పెట్టడంతో.. వైసిపి సైలెంట్ అయిపోయింది. మరి చింతకాయల విజయ్ ఆరోపణలకు వైసీపీ ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper