Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన ‘అల్లుడా మజాకా’ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. నిజానికి ఈ సినిమా బూతు సినిమా అంటూ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే చాలామంది మూవీ మీద నెగెటివ్ ప్రచారం చేశారు. కారణం ఏదైనా కూడా ఆ సినిమాలో బూతు సీన్లే ఉండవు. సాంగ్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. మరి అలాంటి సినిమాను ఎందుకని బూతు సినిమా అంటూ క్రియేట్ చేశారు అనేది ఎవరికి అర్థం కాదు. మొత్తానికైతే చిరంజీవికి యాంటీగా ఉన్న కొంతమంది ఇలాంటి కొన్ని స్ట్రాటజీలు మైంటైన్ చేశారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అల్లుడా మజాకా సినిమా వచ్చిన సమయంలో చిరంజీవి వరుస ప్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో ఆడకపోయేసరికి చిరంజీవి కొద్ది రోజులు సినిమాలేవి ఒప్పుకోకుండా ఖాళీగా ఉంటూ అసలు ఏం జరుగుతుంది.
తన సినిమా కెరియర్ ఎటు పోతుంది అనేది తనకు తాను రీ కాల్ చేసుకున్నాడు. ఇక అప్పుడు మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన హిట్లర్ మూవీని తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు.
మొత్తానికి అల్లుడా మజాకా సినిమా కూడా చూడడానికి బాగుంటుంది. కానీ ఎందుకని ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదనేది ఎవరికి అర్థం కాదు… ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలను చేస్తు ముందుకు సాగుతున్నాడు. 71 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికి యంగ్ హీరోల మాదిరిగానే రోజు కష్టపడుతూ సినిమాలను చేస్తున్నాడు. అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టాయి. రాబోయే సినిమాల విషయంలో కూడా ఆయన అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం మరో 10 సంవత్సరాల వరకు మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ని ఎవరు భర్తీ చేయలేరనేది వాస్తవం… చూడాలి మరి రాబోయే రోజుల్లో చిరంజీవి ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…