Annayya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేసిన అన్నయ్య మూవీ భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి తమ్ముళ్లుగా రవితేజ, వెంకట్ నటించారు. నిజానికి ఈ సినిమాలో చిరంజీవి తమ్ముళ్లుగా చేయడానికి ఒక ఇద్దరు హీరోలు ఇంట్రెస్ట్ చూపించారట. అలాగే చిరంజీవి కూడా ఆ ఇద్దరు హీరోలను పెట్టుకుందామని అనుకున్నప్పటికి చివరి నిమిషంలో వాళ్ళని కాదని వేరే వాళ్ళని పెట్టారు. నిజానికి చిరంజీవి సినిమాలో నటించాలనుకున్న ఇద్దరు స్టార్ హీరోలేవరంటే శ్రీకాంత్, జెడి చక్రవర్తి కావడం విశేషం… ఇద్దరు చిరంజీవి బ్రదర్స్ గా నటించాలని అనుకున్నారు కానీ అప్పటికే వాళ్ళు హీరోలుగా కొనసాగుతున్నారు. దానివల్ల వాళ్ళ ఇమేజ్ కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి వాళ్ళిద్దరిని వద్దని అప్పుడే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న రవితేజ, వెంకట్ లను తీసుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి అందరి గురించి ఆలోచించి డిసిషన్ తీసుకుంటాడని అందువల్లే ఆయన మెగాస్టార్ అయ్యాడని చాలామంది భావిస్తుంటారు.
నిజానికి చిరంజీవి తో వాళ్ళిద్దరు తప్పకుండా చేద్దామని ఇంట్రెస్ట్ చూపించారట. కానీ చిరంజీవి చివరి నిముషంలో మీరు హీరోలుగా చేసుకుంటున్నారు కాబట్టి వద్దని చెప్పి వాళ్ళను కన్విన్స్ చేశాడు… నా మీద ప్రేమతో నా సినిమాలో నటించాలని అనుకుంటున్నారు తప్పు లేదు కానీ వాళ్ల కెరియర్ కూడా చూసుకోవాలి కదా అనే దృక్పథంతోనే చిరంజీవి అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారట.
మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి తన తోటి ఆర్టిస్టుల పట్ల కూడా చాలావరకు ఇంట్రెస్ట్ చూపిస్తారని వాళ్ళ కెరియర్ కూడా బాగుండాలని కోరుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో కాకా అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రీసెంట్ గా చిరంజీవి బర్త్ డే రోజు రిలీజ్ అయింది…
మొత్తానికైతే ఈ మూవీలో చిరంజీవి చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది… ఇక ఇప్పటికే ఈ ఇయర్ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ మూవీ తో సూపర్ సక్సెస్ ను సాధించారు కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి కాకా మూవీతో ప్రభంజనం సృష్టించాలని చూస్తున్నారు…