Homeజాతీయ వార్తలుHardeep Singh Nijjar: నిజ్జర్‌ను చంపింది నేనే.. గోల్డీ బ్రార్‌ ఆడియో వెలుగులోకి..

Hardeep Singh Nijjar: నిజ్జర్‌ను చంపింది నేనే.. గోల్డీ బ్రార్‌ ఆడియో వెలుగులోకి..

Hardeep Singh Nijjar: హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌.. ఖలిస్థానీ మద్దుదారు. మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. కెనడాలో చంపేశారు. ఈ ఘటన భారత్, కెనడా మధ్య చిచ్చు పెట్టింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటి కెడన ప్రధాని భారత్‌ లక్ష్యంగా విమర్శలు చేయడం ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కానీ ఎట్టకేలకు నిజ్జర్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతడిని హత్య చేసింది తానే చెప్పిన ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా […]

Hardeep Singh Nijjar: హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌.. ఖలిస్థానీ మద్దుదారు. మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. కెనడాలో చంపేశారు. ఈ ఘటన భారత్, కెనడా మధ్య చిచ్చు పెట్టింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటి కెడన ప్రధాని భారత్‌ లక్ష్యంగా విమర్శలు చేయడం ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కానీ ఎట్టకేలకు నిజ్జర్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతడిని హత్య చేసింది తానే చెప్పిన ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో కెనడాలో 2023లో జరిగిన హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్‌(సతీందర్‌జీత్‌ సింగ్‌) ఒక ఆడియోలో తన బృందమే ఆ హత్యను చేసిందని తెలిపారు.

ఆడియోలో ఏముంది..
ఆ ఆడియోలో గోల్డీ బ్రార్, నిజ్జర్‌ మాదక ద్రవ్యాల వ్యాపారులకు మద్దతు ఇచ్చాడని ఆరోపించాడు. 16 నుంచి17 ఏళ్ల యువతను బ్లాక్‌మెయిల్‌ చేసి డ్రగ్స్‌ అమ్మేలా ప్రోత్సహించే వారికి నిజ్జర్‌ బలం ఇచ్చాడని, అది ప్రమాదకరమని చెప్పాడు. ‘‘అందుకే నేను, నా టీమ్‌ నిజ్జర్‌ను చంపాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ చర్యల పరిణామాలను ఎదుర్కోవాలి’’ అని పేర్కొన్నాడు. తన సోదరుడి హత్యతో సంబంధం, ఇతర గ్యాంగ్‌లతో లింకులు కూడా హత్యకు కారణమని తెలిపాడు. 2023 జూన్‌లో కెనడాలోని సర్రే నగరంలో గురుద్వారా బయట నిజ్జర్‌ను కాల్చి చంపారు. భారత్‌ అతన్ని ఖలిస్థానీ ఉగ్రవాదిగా గుర్తించింది. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించగా, ఢిల్లీ దాన్ని తోసిపుచ్చి గ్యాంగ్‌ రైవల్రీగా చెప్పింది.

జైలు నుంచి బిష్ణోయ్‌ ఆదేశాలు..
2026లో అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ లారెన్స్‌ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై నిజ్జర్‌ హత్యకు ఆదేశాలు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. బిష్ణోయ్‌ జైలు నుంచే సెల్‌ఫోన్‌ల ద్వారా ఆపరేషన్‌ నడిపినట్లు, బ్రార్‌ ఉత్తర అమెరికా ఆపరేషన్లను చూసుకున్నట్లు ఆరోపణలున్నాయి. భారత ప్రభుత్వ ప్రమేయం గురించి ఆ ఛార్జీల్లో ప్రస్తావన లేదు. కెనడా కూడా తర్వాత భారత ప్రభుత్వ లింక్‌కు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు భారత్‌ చెప్పిన గ్యాంగ్‌ యుద్ధ కోణానికి బలం చేకూరుస్తున్నాయి.

గ్యాంగ్‌లు, డ్రగ్స్, రాజకీయాలు..
బిష్ణోయ్‌–బ్రార్‌ నెట్‌వర్క్‌ భారత్, కెనడా, అమెరికాలో ఎక్స్‌టార్షన్, డ్రగ్‌ ట్రాఫికింగ్, హత్యలతో ముడిపడి ఉందని విచారణలు చెబుతున్నాయి. నిజ్జర్‌ వంటి ఖలిస్థానీ వ్యక్తులు కొన్ని స్థానిక నెట్‌వర్క్‌లతో సంబంధాలు కలిగి ఉండటం, యువతను డ్రగ్‌ వ్యాపారంలోకి లాగడం వంటి ఆరోపణలు ఈ కేసును మరింత క్లిష్టంగా చేశాయి. గోల్డీ బ్రార్‌ వైరల్‌ ఆడియోలో డ్రగ్స్, యువత దోపిడీని కారణంగా చెప్పడం. ఇలాంటి అంతర్జాతీయ గ్యాంగ్‌లు రాజకీయ ఉద్యమాలను, మతపరమైన సంస్థలను కవర్‌గా ఉపయోగించుకోవడం సాధారణమైంది. నిజ్జర్‌ హత్య ఒకవైపు దౌత్య సంబంధాలను దెబ్బతీస్తే, మరోవైపు గ్యాంగ్‌ రైవల్రీని బహిరంగం చేసింది.

ఈ ఆడియో వైరల్‌ కావడం భారత్‌ స్టాండ్‌ను బలపరుస్తుంది. అయితే ఆడియో ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అమెరికా, కెనడా విచారణలు కొనసాగుతున్నాయి. గోల్డీ బ్రార్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఎఫ్‌బీఐ అతని అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ప్రకటించింది. మొత్తగా ఈ ఆడియో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper