Allu Arjun Emotional Tweet: పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగినప్పటికీ, మెగా స్టార్ చిరంజీవి దగ్గరకి వచ్చేలోపు కొంతమంది బాగా ఎమోషనల్ అయిపోతుంటారు , ఆయన పై తమకు ఉన్న అభిమానాన్ని బయటపెడుతుంటారు. అలాంటి హీరోల్లో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈయనకు చిరంజీవి అంటే ఎంత పిచ్చి ప్రేమ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో అల్లు , మెగా కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడింది అంటూ సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తున్నారు కానీ , అందులో ఎలాంటి వాస్తవం లేదని అనేక సందర్భాలు నిరూపించాయి. అలాంటి సందర్భమే నేడు అల్లు అర్జున్ చిరంజీవి కి తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షలు ట్వీట్. ఈ సందర్భంగా ఎమోషనల్ గా , గుండెలోతుల్లో నుండి అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘వన్ & ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మా కుటుంబానికి వెన్నుముక లాంటి వాడు. నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి , జీవితం లో ఎదిగేలా చేసాడు. ఇప్పటికే కాదు , ఎప్పటికీ ఒకటే మాట. కట్టే కాలేంత వరకు మెగాస్టార్ చిరంజీవి అభిమానినే’ అంటూ చాలా ఎమోషనల్ గా ఒక ట్వీట్ వేశాడు . ఈ ట్వీట్ కి మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా మెగా ఫ్యాన్స్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో నిత్యం ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. గతం లో ఎన్నో సందర్భాల్లో ఇది మనం కళ్లారా చూశాము. కానీ ఈ ఒక్క ట్వీట్ తో ఇరు వర్గాలు కలిసిపోయాయి. ఇలా ఎల్లపుడు ఐకమత్యం తో ఉండాలని మెగా సీనియర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఎంతో భావోద్వేగం తో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వేసిన ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది. మహేష్ బాబు , సీఎం చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ లతో పాటు, ఎంతోమంది సినీ , రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి కి సోషల్ మీడియా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. దీంతో సోషల్ మీడియా మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. అంతే కాకుండా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా , ఆయన ప్రస్తుతం డైరెక్టర్ బాబీ తో కలిసి చేస్తున్న ‘కాకా’ మూవీ గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk) pic.twitter.com/QP1H2mX4v0
— Allu Arjun (@alluarjun) August 22, 2026