Homeఎంటర్టైన్మెంట్Zombie Reddy 2: 'జాంబీ రెడ్డి 2' టీజర్ వచ్చేసింది.. తేజ సజ్జ తో పాటు...

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’ టీజర్ వచ్చేసింది.. తేజ సజ్జ తో పాటు మరో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఎంట్రీ అదుర్స్..

Zombie Reddy 2: ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హిట్లు ఇచ్చే హీరోల లిస్ట్ తీస్తే అందులో తేజ సజ్జ కచ్చితంగా ఉంటాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , చిన్నప్పుడే స్టార్ గా ఎదిగిన తేజ సజ్జ, పెద్దయ్యాక ‘బేబీ’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా తర్వాత ఈయన చేసిన ‘అద్భుతం’, ‘ఇష్క్’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత […]

Zombie Reddy 2: ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హిట్లు ఇచ్చే హీరోల లిస్ట్ తీస్తే అందులో తేజ సజ్జ కచ్చితంగా ఉంటాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , చిన్నప్పుడే స్టార్ గా ఎదిగిన తేజ సజ్జ, పెద్దయ్యాక ‘బేబీ’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా తర్వాత ఈయన చేసిన ‘అద్భుతం’, ‘ఇష్క్’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన కెరీర్ కి పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే , అది ‘జాంబీ రెడ్డి’ చిత్రమే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఆయన హీరో గా నటించిన ‘హనుమాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలను నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా నటించిన ‘మిరాయ్’ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘జాంబీ రెడ్డి 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్సకత్వం వహించడం లేదు కానీ, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సూపర్న్ ఎస్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేయగా , దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శనాయ కపూర్ నటిస్తుండగా , కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ చిత్రం లో ఉపేంద్ర నటిస్తున్నడానే విషయం ఎవరికీ తెలియదు. నేడు ఈ గ్లింప్స్ లో ఆయన పేరు కూడా వేయడం తో అందరూ సర్ప్రైజ్ అయ్యారు.

ఇక ఈ గ్లింప్స్ ని చూస్తుంటే ఈసారి భారీ బడ్జెట్ తో , చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తీయబోతున్నారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తోంది. అయితే గ్లింప్స్ మొత్తం యానిమేషన్ రూపం లో ఉండడం తో , ఆడియన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఇంత షూటింగ్ జరిగింది కదా , ఇంకా ఎందుకు ఇలా యానిమేటెడ్ వీడియోస్ చేయడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే గ్లింప్స్ చివర్లో , ఈసారి వేరే లెవెల్ అంటూ తేజ సజ్జ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ గ్లింప్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper