Teja Sajja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కలెక్షన్స్ ని సైతం కొల్లగొడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జ లాంటి హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నాడు. ఇక ఇప్పటికే హనుమాన్, మిరాయి లాంటి సూపర్ సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న తదుపరి ప్రాజెక్టులతో కూడా వరుస విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సక్సెసుల్లో ఉన్నాడు కాబట్టి అతని డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షో మంచి పాపులారిటిని పాల్గొన్నారు. మరి ఈ షోకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీకి రావడానికి గల ముఖ్య కారణాలను కూడా తెలియజేశాడు…
Does Teja Sajja know who his godfather is in the industry?
ఒకరోజు వాళ్ళ మదర్ ఫాదర్ తో కలిసి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుణశేఖర్ తనని చూసి ‘చూడాలని ఉంది’ సినిమాలో చిరంజీవి కొడుకు క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారట. ఇక అప్పటినుంచి తన కెరీర్ అనేది ముందుకు సాగుతూనే ఉందని అందుకే తనకు ఇండస్ట్రీలో కెరియర్ ను ఇచ్చింది గుణశేఖర్, చిరంజీవి గారే అని చెప్పాడు.
ఇక ఏది ఏమైనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన చాలామంది ఆ తర్వాత హీరో గా నిలబడలేకపోయారు. ఇక వాళ్లు కూడా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కానీ తేజ సజ్జ మాత్రం వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
ఇకమీదట కూడా ఆయన ఇలాంటి సక్సెస్ లను సాధిస్తే మాత్రం టైర్ వన్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…