Teja Sajja: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు మాత్రమే ఇక్కడ ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతూ ఉంటాయి. అలాగే ప్రేక్షకులందరు వాళ్ళ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్లకు కూడా భారీ క్రేజ్ అయితే ఏర్పడుతోంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాకి ఉన్న డిమాండ్ చిన్న హీరోల సినిమాలకు ఉండదు. ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జ లాంటి నటుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చిన్న హీరోగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టే హీరోగా మారాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ‘హనుమాన్’ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన చాలా సెలెక్టెడ్ గా స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ సినిమాకు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ‘మిరాయి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఈ సినిమాతో రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
Also Read: ‘బిగ్ బాస్ 9’ నుండి శ్రేష్టి వర్మ అవుట్..ఒక్క వారం ఉన్నందుకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!
ఇక మిరాయి సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ రావడంతో బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ తన చేస్తున్న సినిమాలో తేజ తో ఒక క్యారెక్టర్ ని చేయించాలని అనుకున్నారట. దానికి అనుగుణంగానే రీసెంట్ గా తేజ సజ్జ కి కాల్ చేసి మరి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
ఇక తను చేస్తున్న సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందని చెప్పి అది నువ్వు చేస్తే బావుంటుందని చెప్పాడట. దానికి తేజ మాత్రం ఆ కథలో తన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత చెబుతానని చెప్పడం విశేషం… మొత్తానికైతే బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ కాల్ చేసి మాట్లాడినా కూడా తేజ ఎటువంటి మొహమాటానికి వెళ్లకుండా చాలా కరాకండిగా తన క్యారెక్టర్ ఏంటో తెలిసిన తర్వాత చెప్తానని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
ఇక ఇదంతా చూస్తున్న నెటిజన్లు మాత్రం ఇప్పటికే బాలీవుడ్ హీరోలు మన హీరోలకు చాలావరకు మైనస్ అవుతున్నారు. వాళ్ళ సినిమాల్లో నటించిన కాని, వాళ్ళ దర్శకులతో సినిమాలు చేసిన కాని మన హీరోలు ప్లాప్ లను మూట గట్టుకుంటున్నారు. కాబట్టి తేజ సజ్జ షారుక్ ఖాన్ తో సినిమా చేయకపోవడం బెటర్ అని మరికొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…