Homeఆంధ్రప్రదేశ్‌AP Pilot Training: ఏపీలో ఆ మూడు చోట్ల పైలెట్ల శిక్షణ!

AP Pilot Training: ఏపీలో ఆ మూడు చోట్ల పైలెట్ల శిక్షణ!

AP Pilot Training: ఏపీలో పైలెట్ శిక్షణ తీసుకోవాలనుకునే వారికి గొప్ప అవకాశం. కొత్తగా ఏపీలో మూడు విమానాశ్రయాల్లో పైలెట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా శిక్షణ ఇచ్చే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లు కొత్తగా మూడు చోట్ల ఏర్పాటు కానున్నాయి.. రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఏపీఎడిసిఎల్ నిర్వహణలో ఉండగా.. రాజమండ్రిలో మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది. కడప ఎయిర్పోర్ట్ లో సైతం ఏ ఏ […]

AP Pilot Training: ఏపీలో పైలెట్ శిక్షణ తీసుకోవాలనుకునే వారికి గొప్ప అవకాశం. కొత్తగా ఏపీలో మూడు విమానాశ్రయాల్లో పైలెట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా శిక్షణ ఇచ్చే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లు కొత్తగా మూడు చోట్ల ఏర్పాటు కానున్నాయి.. రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఏపీఎడిసిఎల్ నిర్వహణలో ఉండగా.. రాజమండ్రిలో మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది. కడప ఎయిర్పోర్ట్ లో సైతం ఏ ఏ ఐ నిర్వహణలోని కొనసాగుతోంది. ఈ మూడు చోట్ల కొత్తగా పైలట్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం అవుతాయి. తిరుపతి విమానాశ్రయంలో కూడా ఏర్పాటుకు ఒక ప్రతిపాదన ఉంది. ఈ కేంద్రాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి పొందిన ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేస్తాయి. విమానాశ్రయాల్లో ట్రాఫిక్, విమానాల రాకపోకలను బట్టి అనుమతించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎక్కడ పైలెట్ల శిక్షణకు సంబంధించి సంస్థలు లేవు.

* తొలిసారిగా కర్నూలులో..
తొలిసారిగా కర్నూలు ఎయిర్పోర్ట్లో రెండు ఎఫ్డీఓ ఏర్పాటు జరగనుంది. ఈనెల 22న ఒకటి, డిసెంబర్లో మరొకటి ప్రారంభించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో రెండు ఎఫ్డీఓలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆరు నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. కడప విమానాశ్రయంలో రెండు ఎఫ్డీఓలు ఏర్పాటు చేస్తారు. అక్కడ టెండర్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మూడు విమానాశ్రయాల్లో ఆరు ఎఫ్.టి.ఓలు ఏర్పాటు చేయనున్నారు.

* పదుల సంఖ్యలో మందికి శిక్షణ..
ఒక్కో పైలట్ శిక్షణ కేంద్రంలో 30 నుంచి 45 మందికి శిక్షణ అందిస్తారు. ఆయా ఏర్పోర్ట్ లోని రన్వే కు కనెక్ట్ చేస్తూ శిక్షణ సంస్థ యాంకర్ ఏర్పాటు చేస్తుంది. అక్కడ చిన్న విమానాల ద్వారా శిక్షణ అందిస్తారు. కమర్షియల్ విమానాలు నడిపే పైలెట్లు లైసెన్స్ పొందాలంటే కనీసం 180 గంటల ఫ్లైట్ ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి ఎఫ్డిఓ లలో శిక్షణ అందిస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ దగ్గరగా ఉన్న ఎయిర్ స్క్రిప్ట్ ద్వారా ఎఫ్డిఓ ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ సమీపంలో కొత్త ఎయిర్పోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper