Balagam Venu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. నిజానికి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సైతం డిఫరెంట్ వే లో ముందుకు సాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి వెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ‘బలగం’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు సైతం ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వేణు ఒకప్పుడు నటుడిగా చాలా బిజిగా ఉండేవాడు. చాలా ఈవెంట్లలో పాల్గొంటూ, సినిమాలను చేస్తూ చాలా బాగా డబ్బులను సంపాదించాడు. ఇక జబర్దస్త్ షో తో మరింత పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. అయితే తను దర్శకుడు కావాలనే ఉద్దేశ్యంతో జబర్దస్త్ షో మానేసిన తర్వాత చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. దాదాపు ఒక నాలుగు సంవత్సరాల పాటు తను ఫైనాన్షియల్ గా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ‘బలగం’ వేణు నటుడిగా స్టార్ కమెడియన్ గా ఎదగకపోయినా కూడా దర్శకుడిగా మాత్రం తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాకి మంచి బజ్ ఉంది. ఇక ఆ బజ్ ను కాపాడుకుంటూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను పడి తను ఈ పొజిషన్ కి వచ్చానని పలు సందర్భాల్లో వివరించాడు. మొత్తానికైతే ఆయన బలగం అనే స్క్రిప్ట్ ని రాసుకొని ప్రేక్షకులను అలరింపజేశాడు. ఈ మూవీతో ఏకంగా నేషనల్ అవార్డ్ ను సైతం అందుకున్నాడు.
ఒక విలేజ్ లో ఒక కుటుంబంలో పడే బాధ ఎలా ఉంటుంది. ఒక చావు వల్ల కుటుంబం ఎలా సఫర్ అవుతుంది. బంధుత్వం బలగం అంటే ఏంటంటేది పెర్ఫెక్ట్ గా చూపించారు… ఇక ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ మూవీతో సైతం సూపర్ హిట్ సాధించడానికి సిద్ధమవుతున్నాడు…