US Lucas Drone Vs Iran Shahed Drone Comparison: వెనకటి కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించేవి. భారీగా మందు గుండు సామాగ్రి వాడేవారు . అత్యంత బరువు ఉన్న బాంబులను వినియోగించేవారు. విపరీతమైన పేలుడు సామర్థ్యం ఉన్న బాంబర్ల ను వాడేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. బాంబులవాడకంలో ప్రపంచ దేశాల తీరు మారింది.
Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!
అమెరికా వ్యాపారంతో..
అమెరికా ఆయుధ వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత బాంబుల తయారీ సరికొత్త దశ మొదలైంది అని చెప్పవచ్చు. యుద్ధ విమానాలను అమెరికా తయారు చేయడం మొదలుపెట్టింది. వాటిని ప్రపంచ దేశాలు కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ఏదో ఒక రూపంలో ప్రపంచ దేశాల మీద ఒత్తిడి లేదా ఆంక్షలు విధించడంతో అమెరికా ఆయుధ వ్యాపారం జోరుగా సాగింది.
ఇతర దేశాల తయారీతో..
ఇతర దేశాలు కూడా యుద్ధ సామగ్రి తయారు చేయడం మొదలు పెట్టాయి. యుద్ధ విమానాలు.. యుద్ధ సామగ్రిని భారీగా తయారుచేశాయి. యుద్ధకాంక్షతో రగిలిపోయే దేశాలు వీటిని కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. అయితే ఇలా యుద్ధ సామగ్రిని కొనుగోలు చేయడం వాటిని అమ్మే దేశాలకు భారీగా నగదును అందిస్తే.. కొనుగోలు చేసే దేశాల మీద తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చాయి.
ఇప్పుడు కాలం మారింది
ఇప్పుడు కాలం మారింది. యుద్ధం చేసే తీరు కూడా మారిపోయింది. అందువల్లే కొన్ని దేశాలు అత్యాధునిక ఆయుధ సామాగ్రిని రూపొందించుకోవడం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే అత్యాధునిక మిసైల్స్.. యుద్ధ విమానాలను తయారుచేస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన యుద్దాలను పరిశీలిస్తే డ్రోన్ల వాడకం పెరిగిపోయింది. గతంలో డ్రోన్లను కొన్ని దేశాలు మాత్రమే తయారు చేసేవి. అయితే ఇప్పుడు దాదాపు చాలా వరకు దేశాలు డ్రోన్లను తయారు చేస్తున్నాయి. వీటికి స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడిస్తున్నాయి . యుద్ధాలు .. ఇతర అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటిని ఉపయోగిస్తున్నాయి.
భారత్ చేతిలో ఏముందంటే..
మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాలు తయారుచేసిన డ్రోన్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇరాన్ దేశం షాహిద్ అనే పేరుతో డ్రోన్ తయారుచేసింది. దీనిద్వారా శత్రుదేశాల యుద్ధ విమానాలను .. మిస్సైల్స్ ను కూల్చివేస్తోంది. అమెరికా కూడా లూకాస్ పేరుతో ఒక డ్రోన్ రూపొందించింది. దీనితో ఇరాన్ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్, అమెరికాలో సొంత డ్రోన్లతో గగనతలంలో విన్యాసాలు చేస్తున్న వేళ.. భారత్ పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే రక్షణ రంగ నిపుణులు తెరపైకి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తీసుకొచ్చారు. అమెరికా, ఇరాన్ మాదిరిగానే భారత్ సొంత డ్రోన్ రూపొందించుకుంది. దీని పేరు శేష్ నాగ్ -150. బెంగళూరులోని ఎన్ఆర్టి సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది. ఈ డ్రోన్ 25 నుంచి 40 కిలోల ఆయుధాలతో దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ను రీచ్ అవుతుంది. జిపిఎస్ సిగ్నల్ లేని చోట కూడా విజువల్ నావిగేషన్ ద్వారా ఇది పనిచేస్తుంది. యుద్ధక్షేత్రంలో సొంత ఇంటెలిజెన్స్ సహాయంతో నిర్ణయాలు తీసుకుంటుంది. దగ్గర్లో ఉన్న ఇతర డ్రోన్లతో ఇది కమ్యూనికేట్ చేసుకుంటుంది.