Vijay divorce settlement: గత వారం రోజుల నుండి సోషల్ మీడియా లో తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం గురించి ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాము. విడాకుల పిటీషన్ లో విజయ్ భార్య సంగీత పేర్కొన్న ఆరోపణలు విజయ్ పరువుని పూర్తిగా తీసేలా చేశాయి. సరిగ్గా రెండు నెలల్లో తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యం లో , ఆమె ఈ రేంజ్ లో ట్విస్ట్ ఇవ్వడం తమిళ నాడు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విజయ్ గుట్టు చప్పుడు కాకుండా, తన భార్య తో సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకోసం ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో ఒకసారి చూద్దాం.
తన భార్య సంగీత కు విజయ్ 250 కోట్ల రూపాయిల భరణం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు , పిల్లల భవిష్యత్తు కోసం ఈ డబ్బులు తీసుకోవాలని, మళ్లీ కోర్టు మెట్లు ఎక్కి, ఈ ప్రస్తావన తీసుకొని రాకూడదని , ఇక్కడితో సైలెంట్ అయిపోవాలని విజయ్ తన భార్య తో రహస్యం గా చర్చలు జరుపుతున్నాడట. మరి అందుకు ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే సంగీత స్వతహాగా కోటీశ్వరురాలు. ఆమె ఎన్నో వందల కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి , స్వయంగా తన కాళ్ళ మీద తానూ నిలబడే సత్తా ఉంది. అలాంటి అమ్మాయి ఎందుకు ఈ డీల్ కి ఒప్పుకుంటుంది? , పైగా పిటీషన్ లో కూడా ఆమె స్పష్టంగా ఈ విషయం లో క్లారిటీ ఇచ్చింది. తనకు ఎలాంటి భరణం అవసరం లేదని, కాకపోతే ప్రస్తుతం విజయ్ ఉంటున్న ఇల్లు తన పరం చేస్తే చాలని పేర్కొంది.
Also Read: ‘బేబీ’ మూవీ హీరోయిన్ ని పెళ్లాడబోతున్న ఆనంద్ దేవరకొండ..? సంచలనం సృష్టిస్తున్న లేటెస్ట్ ఫోటోలు!
స్వయంగా ఆమెనే భరణం అక్కర్లేదు అని చెప్పిన తర్వాత విజయ్ మళ్లీ అలాంటి ఆఫర్ ఇస్తే ఆమె ఒప్పుకుంటుందా అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. పైగా కొడుకు జేసన్ సంజయ్ కూడా సంపాదించే స్థాయికి వచ్చేసాడు. రీసెంట్ గానే ఆయన ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టి ‘సిగ్మా ‘ అనే సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇలా విజయ్ పిల్లలు కూడా సంపాదించుకునే స్థాయికి వచ్చేసారు, కాబట్టి ఈ ఆఫర్ ని ఆమె ఎంత వరకు ఒప్పుకుంటుందో చూడాలి.