Telangana Outsourcing Agency Fraud: సాధారణంగా దొంగలు పడితే ఇంట్లో సామాన్లు పోతాయి, కానీ మన తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడితే ఏకంగా ‘ఉద్యోగాలే’ పుట్టుకొచ్చాయి! సినిమాల్లో చూపిస్తే లాజిక్ అడుగుతామని భయపడి డైరెక్టర్లు కూడా టచ్ చేయని ఒక అద్భుతమైన ‘సైన్స్ ఫిక్షన్’ కథ మన రాష్ట్రంలో ఇన్నేళ్లుగా నిశ్శబ్దంగా నడిచిపోతోంది.
Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!
ఏమిటా వింత?
రాష్ట్రంలో సుమారు 25 వేల మంది ఉద్యోగులు ఉన్నారట. వీరు ఆఫీసులకు వస్తారు పేపర్ల మీద.. పని చేస్తారు ఫైళ్ల మీద.. జీతాలు కూడా తీసుకుంటారు బ్యాంకు ఖాతాల్లో… కానీ తీరా చూస్తే… వీరికి ఈ భూమి మీద ఉనికిని చాటే ‘ఆధార్ కార్డు’ ముక్క కూడా లేదు! అంటే వీరు మనుషులా? లేక ఏజెన్సీలు సృష్టించిన ‘డిజిటల్ ఆత్మలా?’ అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
వీరి క్వాలిఫికేషన్ అడ్డదారిలో నడవగలగడం.. అనుభవం ఏంటంటే ఏజెన్సీల జేబులు నింపడంలో ప్రావీణ్యం సంపాదించడం.. గుర్తింపు కార్డు లేదనడం గాలిలో దీపం, కాగితం మీద సంతకాలుచూపించారు.
ఐఎఫ్ఎంఎస్ (IFMS).. ది విలన్ ఆఫ్ ది స్టోరీ!
పాపం, ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎంచక్కా “కంటికి కనిపించని” ఉద్యోగులతో కోట్లు గడిస్తుంటే.. ఈ కాంగ్రెస్ సర్కార్ IFMS అనే అస్త్రాన్ని బయటకు తీసింది. “మీ వివరాలన్నీ కంప్యూటర్లో పెట్టండి, నేరుగా జీతాలు ఇస్తాం” అని ప్రభుత్వం అనేసరికి, అప్పటివరకు ‘ఘోస్ట్ రైడర్స్’ లాగా జీతాలు కొట్టేసిన బ్యాచ్ అంతా ఒక్కసారిగా ఆవిరైపోయారు. ఆధార్ లింక్ అనగానే 25 వేల మంది “మాయా మనుషులు” మాయమైపోయారు.
సీఎం సీరియస్.. ఏజెన్సీల గుండెల్లో రైళ్లు!
“ఏంటి.. నా రాష్ట్రంలో ఆధార్ లేని అపర మేధావులు 25 వేల మందా?” అని సీఎం రేవంత్ రెడ్డి షాక్ తిన్నారు. వెంటనే కలెక్టర్లకు ఆర్డర్ వేశారు. “ఆ ఏజెన్సీల పని పట్టండి, క్రిమినల్ కేసులు పెట్టండి” అని. ఇన్నాళ్లూ ‘పీఎఫ్’ అంటే ‘పర్సనల్ ఫండ్’ అనుకుని నొక్కేసిన ఏజెన్సీలకు ఇప్పుడు అసలైన ‘పోలీస్ ఫైల్’ సినిమా కనిపిస్తోంది.
నిరుద్యోగులు ఏళ్ల తరబడి లైబ్రరీల్లో కళ్లు కాయలు కాచేలా చదువుతుంటే, ఇక్కడ కొందరు మహానుభావులు ఏకంగా ‘అడ్రస్’ లేకుండానే అడ్మినిస్ట్రేషన్ నడిపించేశారు. నిజంగా వీరికి ఆస్కార్ ఇవ్వకపోయినా, కనీసం ‘చంచల్‌గూడ’ పాస్ ఇవ్వాలని సర్కార్ డిసైడ్ అయ్యింది!