US increases tariffs on Chinese imports
America: అగ్రరాజ్యం అమెరికా చైనాకు షాక్ ఇచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో పర్యటించిన రెండు రోజులకే అమెరికా అధ్యక్షుడు బైడెన్ డ్రాగన్ కంట్రీకి షాకిచ్చారు. చైనీస్ దిగుమతులపై సుంకాలను భారీగా పెంచేశారు. చైనా ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 వాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపై విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.
దిగుమతులపై ప్రభావం..
అమెరికా తీసుకున్న నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మూడేళ్లు అమలులో ఉంటుంది. అమెరికాలో చవక ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వదేశీ వస్తువుల వినియోగం కోసం..
అమెరికాలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగడానికి అధ్యక్షుడు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కొత్త ఆవిష్కరణల ఉత్పత్తి చాలా అవసరం. దీంతో అమెరికాలోనే కొత్త ఉత్పత్తులు తయారు చేడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.
2025 నాటికి ఇలా..
పెంచిన సుంకంతో 2025 నాటికి సెమీ కండక్టర్లు, ట్యాంక్ రేట 25 శాతం నుంచి 50 శాతం పెరుగుతంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది. నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదల ఉంటుంది. బ్యాటరీల విడిభాగాలపై సుంకం 25 శాతం వరకు పెరుగుతుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Us increases tariffs on chinese imports