Aarthi Agarwal: తెలుగు ఆడియన్స్ చిరస్థాయిగా గుర్తించుకోదగ్గ హీరోయిన్స్ లో ఒకరు ఆర్తి అగర్వాల్. ఈమెని చూస్తే మన ఇంట్లోని అమ్మాయి లాగానే అనిపిస్తుంది. ఆరోజుల్లో యూత్ ఆడియన్స్ తో పాటు , ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈమెని ఎంతగానో ఇష్టపడేవారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం తో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా ఆర్తి అగర్వాల్, ఆ తర్వాత నువ్వు లేక నేను లేను , ఇంద్ర, నీ స్నేహం, వసంతం, నేనున్నాను , సంక్రాంతి , అందాల రాముడు , గోరింటాకు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే కొత్త హీరోయిన్స్ రాకతో , బాగా లావు అవ్వడంతో ఆర్తి అగర్వాల్ కి నెమ్మదిగా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. సినిమా అవకాశాల కోసం తన శరీరాన్ని తగ్గించుకునే క్రమంలో లైపో సర్జరీ చేయించుకుంది. అది వికటించడం తో ప్రాణాలను కోల్పోయింది ఆర్తి అగర్వాల్.
అయితే ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి కేవలం లైపో సర్జరీ వికటించడం మాత్రమే కాదు , ఆమె వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కొన్ని ఆమె కెరీర్ పై ప్రభావం చూపించాయి , తద్వారా ఆమె చాలా మానసిక ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడి కారణంగానే సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఎలా అయినా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలనే తపనతో తొందరగా శరీరాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం ఆమె ప్రాణాలు తీసింది. ఇంతకీ ఆమె కెరీర్ పై ప్రభావం చూపించిన వ్యక్తిగత కారణం హీరో తరుణ్ ని ఈమె పిచ్చిగా ప్రేమించడం. ఈ లవ్ బ్రేక్ అవ్వడం తో ఈమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటి నుండే పీక్ రేంజ్ లో వెళ్తున్న ఆమె కెరీర్ నెమ్మదించింది. రెండేళ్ల పాటు సినిమా కెరీర్ కి బ్రేక్ ఇచ్చి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.
కానీ రీ ఎంట్రీ ఆమెకు అసలు కలిసి రాలేదు. ఈ రీ ఎంట్రీ సమయం లోనే ఆమె ఉజ్జ్వల్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల 2009 లో అతనితో విడాకులు తీసుకుంది. ఇది ఆమె మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురి అయ్యేందుకు మూడవ కారణం. ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉండుంటే ఈరోజు ఆర్తి అగర్వాల్ త్రిష , నయనతార రేంజ్ లో హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉండేదేమో. తొందరపాటు నిర్ణయాల కారణంగా 31 ఏళ్ళ వయస్సులోనే ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆర్తి అగర్వాల్ లేని లోటు ఇప్పటికీ టాలీవుడ్ లో స్పష్టంగానే కనిపిస్తోంది. ఆమెని రీ ప్లేస్ చేసే హీరోయిన్ మరొకరు ఇప్పటి వరకు రాలేదు.
