America Politics : అమెరికా రాజకీయాల్లో సామాజిక కోణంలో ఎలా ఉంది? అమెరికా సమాజం వైవిధ్యభరితమైన సమాజం. తెల్లవాళ్లు డామినేట్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ తెల్లజాతీయుల జనాభా సగానికి సగం పడిపోయింది. లేటెస్ట్ గణాంకాలు చూస్తే కేవలం 56 శాతం తెల్లజాతీయులే అమెరికా ఉన్నారు. మిగతా అంతా వివిధ దేశాల నుంచి వచ్చినవారే..

ఈ ఎన్నికల్లో ట్రంప్ చేసిన అతిపెద్ద పొరపాటు నిద్రపోతున్న పులిని లేపినట్టైంది. అదే లాటినోలు.. లాటిన్ అమెరికాలో ఉండేవారు అందరూ.. ఇస్పానిష్ లు అని కూడా అంటారు. అంటే స్పానిష్ మాట్లాడేవారు.. బ్రెజిల్ లో పోర్చుగీసు మాట్లాడుతారు. మిగతా దక్షిణ అమెరికా స్పానిష్ మాట్లాడుతారు..
జనరల్ గా వీళ్లు ఎన్నికల్లో యాక్టివ్ గా ఉండరు. సరిగ్గా ఓట్లు వేయరు. కానీ ఈసారి ఉధృతంగా ఉద్యమంలా ఓటు వేశారు. జనాభాలో 20.5 శాతం ఉన్న లాటిన్ అమెరికన్స్ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలాగైనా సరే ట్రంప్ ను ఓడించాలన్న కసికి లాటిన్ అమెరికన్స్ వచ్చారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేసింది లాటిన్ అమెరికన్స్ నే..

అమెరికా జనాభాలో 20.5 శాతం లాటిన్ అమెరికన్స్, నల్లజాతీయులు 13.5 శాతం, ఆసియన్లు 6.9 శాతం, మిశ్రమ జాతీయులు 4.9 శాతం, అమెరికా ఆదివాసులు 2.1 శాతం, హవాయి, ఇతర పసిఫిక్ సముద్రవాసులు 0.3 శాతం, జనాభాలో విదేశాలలో జన్మించిన వారు 14.1 నుంచి 15.2 శాతం వరకూ ఉంటారు.
అమెరికా రాజకీయాల్ని శాసించేది ఇక లాటినోలే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.