Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్ ఓడిపోయారు.. ఐటీ నుంచి వలస వరకు..మనకు అన్ని మంచి రోజులేనా..

Donald Trump: ట్రంప్ ఓడిపోయారు.. ఐటీ నుంచి వలస వరకు..మనకు అన్ని మంచి రోజులేనా..

Donald Trump: అమెరికాలో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ కు దిమ్మతిరిగే ఎదురు దెబ్బ తగిలింది. దానికి తోడు రిపబ్లికన్ పార్టీకి ఊహించని స్ట్రోక్ తగిలింది. ప్రతినిధుల సభ (హౌస్), సెనేట్ .. రెండిట్లోనూ డెమోక్రాట్లు పట్టు బిగించారు. దీంతో ట్రంప్ దూకుడు కు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. ట్రంప్ ఇలా ఓడిపోవడం నిజంగా ఆయన రాజకీయ పతనానికి నాంది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి పెద్దన్న. చేతిలో అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో […]

Donald Trump: అమెరికాలో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ కు దిమ్మతిరిగే ఎదురు దెబ్బ తగిలింది. దానికి తోడు రిపబ్లికన్ పార్టీకి ఊహించని స్ట్రోక్ తగిలింది. ప్రతినిధుల సభ (హౌస్), సెనేట్ .. రెండిట్లోనూ డెమోక్రాట్లు పట్టు బిగించారు. దీంతో ట్రంప్ దూకుడు కు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. ట్రంప్ ఇలా ఓడిపోవడం నిజంగా ఆయన రాజకీయ పతనానికి నాంది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి పెద్దన్న. చేతిలో అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ ఓడిపోతే.. ఆ ప్రభావం భారత్ మీద ఎలా పడుతుంది.. ఈ కథనంలో తెలుసుకుందాం

ట్రంప్ ఓడిపోవడం యావత్ ప్రపంచాన్ని.. భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అపరిమితమైన దూకుడు మొదలుపెట్టారు. పన్నులు బాదడం షురూ చేశారు. దీనివల్ల భారత్ లాంటి దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో భారత్ కు ఏమైనా ఊరట లభిస్తుందా.. లేదా కొత్త సమస్యలు వస్తాయా.. అమెరికాతో భారత కమర్షియల్ ట్రేడ్ రిలేషన్స్.. టారిఫ్ లు.. మైగ్రేషన్ విధానాలు.. వ్యూహాత్మక భాగస్వామ్యం మీద చూపించే ప్రభావం.. వాటి అంశాలు చర్చకు దారితీస్తున్నాయి.

ట్రంప్ మన మీద విధించిన టారిఫ్ లు తీవ్రంగా మన ఎగుమతులను ప్రభావితం చేశాయి. గతంలో 50% వరకు చేరిన పన్నులను 18 శాతానికి తగ్గించినప్పటికీ.. కమర్షియల్ ట్రేడ్ విషయంలో ఇప్పటికి ఒక రకమైన ప్రతిష్టంభన నడుస్తూనే ఉంది. డెమోక్రాట్ల నియంత్రణలోకి కాంగ్రెస్ వెళ్లిన నేపథ్యంలో.. ట్రంప్ ఏకపక్ష సుంకాల వల్ల అమెరికా కస్టమర్లు.. అక్కడి వ్యాపారాల మీద పడుతున్న ప్రభావాన్ని పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా భారతదేశానికి కాస్త వెసలు బాటు ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ డెమోక్రాట్లు స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అనుకూలంగా ఉండరు. అందువల్ల మార్కెట్ యాక్సెస్ విషయంలో భారత్ ఇంకా సవాళ్లు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మనదేశంతో ట్రేడ్ విషయంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హెచ్ 1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ లో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా దేశంతో జరుపుతున్న చమురు కొనుగోళ్ల వైఖరిలో ట్రంప్ ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇవన్నీ ఆశావహంగా కనిపిస్తున్నప్పటికీ, మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సమయంలో డెమోక్రాట్ల వైఖరి కూడా ట్రంప్ మాదిరిగానే ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇండియన్ ఐటీ కంపెనీలకు ఏమవుతుంది

భారతీయులు చాలామంది అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరిలో హెచ్ 1బీ వీసా విధానం అత్యంత ముఖ్యం. అమెరికాలో మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు.. మనదేశంలోని టిసిఎస్.. ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఈ వీసాల మీద ఆధారపడి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ట్రంప్ హెచ్ 1 బీ వీసాల మీద ఆంక్షలు విధించేలాగా చర్యలు చేపట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అయితే ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈ వీసాల విషయంలో దూకుడు తగ్గించుకునే అవకాశం ఉండొచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారతీయ ఐటీ కంపెనీలను.. ఐటి నిపుణులను తీవ్రమైన ఆందోళనకు గురిచేసిన హెచ్ 1 బీ కొత్త పిటిషన్లు.. లక్ష డాలర్ల రుసుము ప్రతిపాదనకు న్యాయస్థానాలలో ట్రంప్ కు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. వలస విధానాలపై తీసుకుని నిర్ణయాలు చాలావరకు అధ్యక్షుడి ప్రత్యక్ష పరిధిలోనే ఉంటాయి. అయితే ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ ఎదురు తిరిగే అవకాశం ఉండడంతో.. భారత ఐటీ ఉద్యోగులకు.. ఐటీ కంపెనీలకు కాస్త ఉపశమనం లభించవచ్చని తెలుస్తోంది

ఇక అమెరికాతో కొనసాగించే సంబంధాల్లో ట్రేడ్.. వలస.. ఐటి విధానాల మాత్రమే కాకుండా డిఫెన్స్.. టెక్నాలజీ కూడా అత్యంత కీలకమైంది. చైనా దూకుడును తట్టుకోవాలి.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించాలి. అలాంటప్పుడు అమెరికాతో భారత్ కొనసాగించే ప్రయోజనాలు మనకు అత్యంత ముఖ్యం. అమెరికాలో అధికార మార్పిడి జరిగినా.. వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే భారత్ ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. గ్లోబల్ లోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ గా అవతరించింది. ఈ నేపథ్యంలో డిఫెన్స్ రంగంలో సహకారం.. అన్నిటికంటే ముఖ్యంగా అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం.. చైన్ లింక్డ్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్ కొనసాగిస్తున్న ఫారిన్ పాలసీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి వాటికి మాత్రమే ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు. దీనివల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో స్తంభన ఏర్పడుతోంది. అయితే డెమోక్రాట్ల ఆధిపత్యం పెరగడం వల్ల ట్రంప్ తన నిర్ణయాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని.. విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఫారెన్ పాలసీలో మాత్రం అధ్యక్షుడికి అధికారాలు కొనసాగడం విశేషం. దీని ప్రకారం ట్రంప్ తీసుకొనే నిర్ణయాలు కఠినంగా ఉంటాయా.. లేదా కొంతమేర సడలింపునకు గురవుతాయా.. అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper